ఈ కథ మహేష్ నుండి నాని దగ్గరకు వెళ్ళింది

‘జెర్సీ’ సినిమా సక్సెస్ తరువాత నాని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ [more]

Update: 2019-04-28 11:19 GMT

‘జెర్సీ’ సినిమా సక్సెస్ తరువాత నాని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజి లో ఉంది. ఇప్పటికే ఈసినిమా కథ బయటకు వచ్చింది. ఇందులో నలుగురు మహిళలు, ఓ విలన్ వుంటారని, నాని రచయితగా నటిస్తున్నారని, ఆ మహిళల తరుపున వారికి న్యాయం చేయడానికి రంగంలోకి దిగుతాడని వినిపిస్తోంది.

అయితే నిజానికి ఇది మహేష్ తో చేద్దాం అనుకున్న కథ అంట. అప్పటిలో విక్రమ్ మహేష్ తో ఓ సినిమా చేద్దాం అనుకున్నాడు కదా అది ఇదే అంట. దీన్ని అశ్వనీదత్ నిర్మిద్దాం అనుకున్నాడు. అందులో విలన్ పాత్ర ను చాలా హై రేంజ్ లో తయారుచేసారట. కానీ మహేష్ బాబు ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు ఆ కథ నే నాని తో చేస్తున్నారు. అందుకోసమే అశ్వనీదత్ కు భారీగా కాంపన్ సేషన్ కూడా ఇచ్చారని టాక్.

ఇప్పుడు ఆ విలన్ పాత్ర ను ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ చేస్తున్నాడు. సినిమా స్టార్టింగ్ లోనే నలుగురు మహిళల మర్డర్ ఎపిసోడ్ వుంటుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈసినిమా ను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News