నాని అది నమ్మొద్దంటున్నాడు!!

నాని బెట్టు చేసి చేసి వి సినిమాని అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశాడు. నేను థియేటర్స్ లోనే దిగుతా అని కంకణం కట్టుకుని కూర్చున్న నాని చివరికి [more]

Update: 2020-08-13 05:38 GMT

నాని బెట్టు చేసి చేసి వి సినిమాని అమెజాన్ ప్రైమ్ కి అమ్మేశాడు. నేను థియేటర్స్ లోనే దిగుతా అని కంకణం కట్టుకుని కూర్చున్న నాని చివరికి ఓటిటి ఆఫర్ కి పడిపోయాడు. ఇక నాని వి తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కథపై అనేక రకాల కథలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అయితే కొత్తగా టక్ జగదీశ్ సినిమాలో నాని ఓ బైపోలార్‍ డిజార్డర్‍ వున్న క్యారెక్టర్‍ చేస్తున్నాడని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో నాని భలే భలే మగాడివోయ్ సినిమాలో మతిమరుపు డిజార్డర్ కేరెక్టర్ లో ఇరగదీసాడు. అందుకే నాని టాక్ జగదీశ్ లో బైపోలార్‍ డిజార్డర్‍ వున్న కేరెక్టర్ లో నటిస్తున్నాడని అనగానే అందరూ నిజమనుకుంటున్నారు.

అయితే తాజాగా నాని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాను టక్ జగదీశ్ లో బైపోలార్‍ డిజార్డర్‍ వున్న కేరెక్టర్ చెయ్యడం లేదని.. వినోదాత్మక పాత్ర చేస్తున్నానని… జగదీష్‍కి ఎలాంటి డిజార్డర్స్ వుండవని స్పష్టం చేసాడు. మరి ఇంతవరకు శివ నిర్వాణ ప్రేమ, పెళ్లి చుట్టూనే తన రెండు సినిమాలను తెరకేక్కిన్చాడు. ఇప్పుడు నాని తో ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడో అనే క్యూరియాసిటీ ఉంది. అయితే టాక్ జగదీశ్ ని శివ నిర్వాణ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని, మజిలీ, నిన్నుకోరి సినిమాలను ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ గా తెరకెక్కించిన శివ ఇప్పుడు టాక్ జగదీశ్ ని మాస్ ఎంటర్టైన్మెంట్ గా తీర్చిదిద్దుతున్నాడట.

Tags:    

Similar News