నాని లెక్క తప్పింది!!

Update: 2018-04-15 07:00 GMT

ఎవడే సుబ్రమణ్యం దగ్గరనుండి నిన్నమొన్నటి ఎంసీఏ వరకు నాని అనుకున్నట్టుగానే అంతా జరిగింది. అందుకే సినిమాల ఎంపికలో ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా చాలాసార్లు చాలా ఇంటర్వూల్లో చెప్పాడు. గతంలో మాస్ మాస్ అంటూ అనేక సినిమా లు చేసి ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయిన నాని... మళ్ళీ సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల్లకు బాగా దగ్గరయ్యాడు. అందుకే వరుస విజయాలతో దూసుకుపోయాడు. డబుల్ హ్యాట్రిక్ తో ఉన్న నాని త్రిబుల్ కూడా కొడదామనుకున్నాడు.... కానీ కృష్ణార్జున యుద్ధం దెబ్బేసేసింది. కామెడీ కి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలను తెరకెక్కించే మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధాన్ని కామెడీ యాంగిల్ లో తెరకెక్కించినా కూడా ప్రేక్షకుల్లకు బోర్ కొట్టేసింది.

మాస్ పాత్రలో...

నాని మాస్ గా కృష్ణ పాత్రలో చెలరేగి నటించి అందరి ప్రశంసలు అందుకున్నప్పటికీ.. అర్జున్ పాత్రలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అంటే ఎంసీఏ సినిమాలో నాని నటనతోనే యావరేజ్ టాక్ నుండి పైకి లేచి కలెక్షన్స్ దుమ్ము దులిపిన నాని కృష్ణార్జున యుద్ధం ఫలితం విషయంలో మాత్రం లెక్క తప్పి ఉసూరుమంటున్నాడు. మాస్ ఆడియన్స్‌ కోసమే తీసినట్టుగా యాక్షన్‌తో కూడిన కృష్ణార్జున సెకండ్ హాఫ్ నాని ఫాన్స్ ని బాగా నిరాశ పరిచింది. అందులోనూ విడుదలకు ముందు సినిమాపై ప్రేక్షకుల్లో నాని సినిమాపై ఎటువంటి ఆసక్తి లేకపోవడం కూడా కృష్ణార్జున యుద్ధం టాక్ కి మైనస్ అనే చెప్పాలి.

ఆ సినిమాతో పోలిస్తే.....

అసలు నాని ఎంసిఏ ఫస్ట్ కలెక్షన్స్ తో పోలిస్తే కృష్ణార్జున కలెక్షన్స్ అరవై శాతమే వున్నాయని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్న మాట. అంతేకాకుండా కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రంపై అటు ట్రేడ్ లోను.. ఇటు ప్రేక్షకుల్లోనూ బజ్‌ పూర్తిగా పోయింది. అలాగే నాని సినిమాలకు ఓవర్సీస్ లో టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు ఉంటాయి. కానీ ఈసారి కృష్ణార్జున విషయంలో అక్కడ కలెక్షన్స్ డల్ గా ఉన్నాయంటున్నారు. మరి నాని మీద నమ్మకంతో కాస్త ఎక్కువ రేటు కోడ్ చేసి సినిమా హక్కులు కొన్న బయ్యర్స్ కి కృష్ణార్జున యుద్ధంతో దెబ్బపడే సూచనలు కనబడుతున్నాయి. మరి నాని క్లాస్ నుండి మాస్ వైపు మొగ్గు చూపడమే ఇలా లెక్క తప్పడానికి కారణమా అనే టాక్ కూడా సోషల్ మీడియాలో వినబడుతుంది.

Similar News