కరోనా తో టెన్షన్ పడుతున్న హీరోలు?

హమ్మయ్య ఎగ్జామ్స్ అన్ని ఓ కొలిక్కి వచ్చి.. సినిమాలకు మంచి కాలం వస్తుంది అనుకుంటే.. ఎప్పుడూ పరీక్షల భయం వదిలి కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఇప్పటికే [more]

Update: 2020-03-12 06:44 GMT

హమ్మయ్య ఎగ్జామ్స్ అన్ని ఓ కొలిక్కి వచ్చి.. సినిమాలకు మంచి కాలం వస్తుంది అనుకుంటే.. ఎప్పుడూ పరీక్షల భయం వదిలి కరోనా వైరస్ భయం పట్టుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా వైరస్ తో థియేటర్స్ మూసుకుంటుంటే.. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ కి వెళ్ల్లడానికి ప్రేక్షకులు భయపడుతున్నారు. థియేటర్స్ ఆక్యుపెన్సీ రాక యజమానులు గోల పెడుతున్నారు. ఈ టైములో పలు సినిమాలు వాయిదాలు పడే అవకాశం ఉన్నట్టుగా న్యూస్ ప్రచారంలోకొచ్చింది. ఇప్పటికే కేరళ లలో థియేటర్స్ మూసేసారు. దానితో మోహన్ లాల్ నటించిన బడా సినిమా మరక్కార్ వాయిదా పడేలా కనబడుతుంది.

మరోపక్క రేపు 25 ఉగాది కానుకగా విడుదలయ్యే నాని – సుధీర్ బాబు ల వి సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉంది అంటూ సోషల్ మీడియా టాక్. అందుకే వి ప్రమోషన్స్ ని చాలా స్లోగా మొదలెట్టారని..లేదంటే ఈపాటికి పిచ్చెక్కించేవారని అంటున్నారు. జస్ట్ సింగిల్స్ తోనే సరిపెడుతున్న టీం.. ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉండడంతో.. అప్పుడే ప్రమోషన్స్ చేసి ఏం చేస్తాం అని గమ్మునున్నారని అంటున్నారు. ఓవర్సీస్ లో కూడా మూవీస్ రిలీజెస్ కష్టమని అంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవడంతో జనాలు గుంపులుగా ఉండేందుకు భయపడుతున్నారు కాబట్టే సినిమాలకు వెళ్లడం తగ్గించేసేసరికి.. ఇప్పుడు సినిమాల పరిస్థితి అగమ్యగోచరం గా కనబడుతుంది. మరి నాని – సుధీర్ బాబు లు డేర్ చేస్తారా లేదంటే సైలెంట్ అవుతారా అనేది తెలియాలి

Tags:    

Similar News