నాని – సుధీర్ బాబు సినిమా టైటిల్ ఇదే..?

విభిన్నమైన జోనర్లలో వైవిధ్యమైన సినిమాలు తీసే దర్శకుడు ఇంద్రగంటి ప్రస్తుతం నాని – సుధీర్ బాబులను పెట్టి ఓ సినిమా తీయనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ [more]

Update: 2019-04-27 07:16 GMT

విభిన్నమైన జోనర్లలో వైవిధ్యమైన సినిమాలు తీసే దర్శకుడు ఇంద్రగంటి ప్రస్తుతం నాని – సుధీర్ బాబులను పెట్టి ఓ సినిమా తీయనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు 29న ముహుర్తం పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి 26నే ప్రారంభించాలి. కానీ ఇప్పుడు 29కి షిఫ్ట్ చేసారు. అయితే ఈ సినిమాకు ఓ విభిన్నమైన టైటిల్ ను పెట్టాలని డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడట. అది కూడా సింగిల్ లెటర్ టైటిల్ పెట్టాలని భావిస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘వి’ అనే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారట.

‘వి’ టైటిల్ ఎందుకు..?

డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా టైటిళ్లలో 90 శాతం వైవిధ్యంగా ఉండేవే. అందుకే ఈ సినిమాకి కూడా అటువంటి టైటిల్ పెట్టాలని ‘వి’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ డైరెక్టర్ ‘వి’ అన్న టైటిల్ ఎందుకు పెట్టాలనుకుంటున్నాడో… టైటిల్ కి హీరోలకు సంబంధం ఏంటో తెలియాలంటే అధికార ప్రకటన కోసం ఆగాల్సిందే. 29న టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశముంది.

Tags:    

Similar News