ఆకాశమే హద్దుగా… ప్రశంసలు..!

ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి మొద‌లు కృష్ణార్జున యుద్ధం వరకు వరుసగా ఎనిమిది హిట్స్ కొట్టాడు నాని. కానీ కృష్ణార్జున యుద్దం దగ్గర నాని హిట్స్ కి బ్రేకులు [more]

Update: 2019-04-20 07:12 GMT

ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి మొద‌లు కృష్ణార్జున యుద్ధం వరకు వరుసగా ఎనిమిది హిట్స్ కొట్టాడు నాని. కానీ కృష్ణార్జున యుద్దం దగ్గర నాని హిట్స్ కి బ్రేకులు పడ్డాయి. కృష్ణార్జున యుద్ధంలో మాస్, క్లాస్ లుక్ లో నాని అలరించినా.. సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. తర్వాత జెర్సీ అంటూ క్రికెట్ బ్యాగ్రౌండ్ ఉన్న కథతో గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నటించాడు. గత కొన్నాళ్లుగా నటనలో తనకి తానే పోటీ పడుతున్న నాని.. ఏ సినిమాకి ఆ సినిమాకే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనుకుంటుంటే.. ఎప్పటికప్పుడు తన నటనను తానే బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు. సహజ సిద్దమైన నటనతో నాని చేస్తున్న పాత్రలు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. జెర్సీలో నాని అర్జున్ పాత్రలో నటించలేదు 100 కి 100 శాతం జీవించాడు. అర్జున్ పాత్రకి నాని తప్ప బెస్ట్ ఆప్షన్ లేదన్నట్టుగా ఆయ‌న‌ నటన ఉంది.

ప్రేక్ష‌కుల చ‌ప్ప‌ట్లు

అర్జున్ పాత్రకి ప్రాణం పోసిన నాని.. ఆ పాత్రలో కెరీర్ లో ఫెయిల్ అవడం, లంచం తీసుకున్నాడని అపోహతో ఉద్యోగం పోగొట్టుకున్న వాడిగా, భార్య ముందు చేతకానివాడిలా, కొడుకు ముందు హీరోలాగా ఉండాలనే తపనతో తనలో తానె పడే మానసిక సంఘర్షణలో… కనిపించనివ్వని ఎమోషన్స్ తో నాని నటన ఆద్యంతం అద్భుతమే. గౌతమ్ రాసుకున్న కథకు నాని జీవం పోసాడు. అర్జున్ పాత్ర ఒప్పుకుని నాని అక్కడే సక్సెస్ అయ్యాడు. జెర్సీలో నాని నటనకు క్రిటిక్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు వేయినోళ్ల పొగుడుతున్నారు. రంజీ కప్ కి సెలక్ట్ అయినప్పుడు కోచ్ తో చెబుతూ భావోద్వేగానికిలోన‌య్యే సన్నివేశం, కొడుకుకు 500 రూపాయలతో జెర్సీ కొనివ్వమన్నప్పుడు.. అందరినీ అప్పు అడిగి.. అలిసిపోయి భార్య పర్స్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయే సందర్భంలో నాని నటనకు థియేటర్స్ లో క్లాప్స్ మోగుతున్నాయి. మరి జెర్సీ సినిమాతో నాని హిట్ కాదు.. సూపర్ హిట్ కాదు కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మరి ఈ అద్భుతమైన ఆనంద క్షణాల్ని నాని తన కొడుకు అర్జున్(జున్నుతో) పంచుకుంటున్నాడు.

Tags:    

Similar News