నాని ఎందుకంత పట్టుబట్టాడో తెలుసా..?

నాని జెర్సీ హిట్ తో గాల్లో తేలిపోతున్నాడు. జెర్సీ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే గ్యాంగ్ లీడర్ [more]

Update: 2019-05-17 08:41 GMT

నాని జెర్సీ హిట్ తో గాల్లో తేలిపోతున్నాడు. జెర్సీ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే గ్యాంగ్ లీడర్ టైటిల్ విషయంలో ఆ మధ్యన మరో చిన్న సినిమా నిర్మాతతో పాటు మెగా ఫాన్స్ కూడా నానిని తెగ ట్రోల్ చేశారు. కానీ నాని మాత్రం నా కథకు గ్యాంగ్ లీడర్ టైటిల్ మాత్రమే సరిపోతుందని… సినిమా చూసాక మీరు అదే చెబుతారని స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చాడు. మరి నాని అంత గట్టిగా గ్యాంగ్ లీడర్ టైటిల్ విషయంలో ఎందుకు ఉన్నాడో అనేది… ఇప్పుడు బయటికొచ్చిన గ్యాంగ్ లీడర్ కథని చూస్తుంటే తెలుస్తుంది.

కథకు తగిన టైటిల్

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం ఈ గ్యాంగ్ లీడర్ కథలో నాని ఒక దొంగగా కనిపిస్తాడట. పైగా అమ్మాయిల దొంగల గ్రూప్ కి నానినే లీడర్ అట. అలాగే ఈ సినిమాలో దొంగతనం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా కామెడీగా విక్రమ్ రాసుకున్నాడని… సినిమా మొత్తం ఫన్నీగా ఉండబోతుందని చెబుతున్నారు. మరి అమ్మాయిల లీడర్ గా నానిని గ్యాంగ్ లీడర్ అంటారట. అందుకే ఈ సినిమాకి ఫైనల్ గా ఈ టైటిల్ నే సెట్ చేశారట. మరి ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నఈ సినిమాలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Tags:    

Similar News