నాని సినిమా టైటిల్ అది కాదు..!

సెన్సిబుల్ స్టోరీస్ ని డీల్ చేయడంలో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఎక్స్ పర్ట్. ‘సమ్మోహనం’ సినిమా తరువాత ఆయన నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఓ [more]

Update: 2019-04-22 08:47 GMT

సెన్సిబుల్ స్టోరీస్ ని డీల్ చేయడంలో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఎక్స్ పర్ట్. ‘సమ్మోహనం’ సినిమా తరువాత ఆయన నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇది ఫిక్స్ అని కూడా టాక్ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ‘వ్యూహం’ కాదట.

అచ్చ తెలుగు టైటిల్

ఈ సినిమాకి కూడా ఓ అచ్చ తెలుగు టైటిల్ నే ఇంద్రగంటి ఈ సినిమాకు టైటిల్ గా పెట్టినట్లు తెలుస్తోంది. తన పాత సినిమాల టైటిల్స్ మాదిరిగానే ఈ సినిమాకి కూడా అటువంటి టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇక ఈ చిత్రంలో మరోసారి అదితి రావ్ హైదరి నటిస్తుంది. మరో హీరోయిన్ గా నివేద థామస్ నటించబోతుంది. థ్రిల్లర్‌ అంశాలతో తెరకెక్కే ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Tags:    

Similar News