నాని నెక్స్ట్ మూవీకి డేట్ ఫిక్స్..!

జెర్సీ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నాని తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ రెగ్యులర్ [more]

Update: 2019-04-24 10:50 GMT

జెర్సీ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నాని తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత నాని తనకు లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటించనున్నాడు. ఇక ఈ సినిమాను ఆఫీషియషల్ గా ఈ నెల 26వ తేదీన లాంచ్ చేయనున్నారు.

టైటిల్ ‘వ్యూహం’ కాదు

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ వేరే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. సినిమా ఓపెనింగ్ రోజు ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ రానుంది. అదే రోజు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక అదితీరావు, నివేద థామస్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Tags:    

Similar News