నానిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు..!

Update: 2018-06-20 09:59 GMT

ప్రస్తుతం నాని బిజీ షెడ్యూల్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. ఒక పక్క సినిమాలు మరోపక్క బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్టింగ్.. అంటే కాకుండా తాజాగా మళ్ళీ రావా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో జెర్సీ సినిమాని ఫైనల్ చేసాడు. సినిమాలు సెట్స్ మీదున్నప్పుడే.. సినిమాల మీద సినిమా లు సైన్ చేసే నాని.. కృష్ణార్జున యుద్ధం తర్వాత చిన్నపాటి గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో నాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో సినిమా చేస్తున్నాడని అన్నారు. కానీ కొరటాల శివ మెగాస్టర్ కి కథ ని సిద్ధం చేస్తున్నాడని... నాని తో కొరటాల శివ సినిమా లేదన్నారు. తాజాగా పూరీ జగన్నాద్ కి నాని అవకాశం ఇచ్చినట్లుగా వార్తలోచ్చాయి.

బాలయ్య కోసం ఎదురుచూపులు

మరి ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న నాని ఫ్లాప్ డైరెక్టర్ ని పిలిచి అవకాశం ఇవ్వడమేమిటంటూ సోషల్ మీడియాలో నాని ని ఉద్దేశించి ఒకటే కామెంట్స్ పడుతున్నాయి. ఎందుకంటే పూరి జగన్నాధ్ కి గత కొంత కాలంగా హిట్ అనేదే లేదు. స్టార్ హీరోలు అవకాశం ఇచ్చినా దాన్ని పూరీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పైసా వసూల్ అప్పుడు బాలకృష్ణ పూరీకి మరో అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. అయితే పైసా వసూల్ దెబ్బకి బాలయ్య బాబు పూరీని సైడ్ చేసాడనే ప్రచారం ఉంది. అయితే బాలయ్య మీద నమ్మకంతో ఉన్న పూరీ జగన్నాధ్ ఈ మధ్యలో కొడుకు ఆకాష్ తో మెహబూబా ని డైరెక్ట్ చెయ్యడమే కాదు నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నాడు కూడా.

మళ్లీ కొడుకుతోనేనా..?

ఇక బాలయ్య అవకాశం ఎప్పుడిస్తాడో అని వెయిట్ చేస్తున్న పూరీ ఈ మధ్యలో నానితో సినిమా అంటూ వార్తలొచ్చాయి. కానీ పూరీ జగన్నాధ్ - నాని కాంబోలో సినిమా లేదని హీరో నాని నే క్లారిటీ ఇచ్చేసాడు. ప్రస్తుతం తనకి మరో దర్శకుడితో కమిట్ అయ్యే ఖాళీ లేదని చెబుతున్నాడు నాని. అలా పూరీ కి నాని మిస్ అయ్యాడు. మరి మెహబూబా తో కొడుక్కి ఫ్లాప్ ఇచ్చిన పూరి జగన్నాధ్ ఇప్పుడు మరోసారి కొడుకునే హీరోగా పెట్టి సినిమా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాగూ ఏ హీరో కూడా పూరి కి అవకాశం ఇచ్చే సాహసం చెయ్యడం లేదు.

Similar News