రెండో సినిమా కే అంత డిమాండా..?

Update: 2018-08-09 09:34 GMT

మినిమం గ్యారంటీ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు నాని. ఎందుకంటే అతను ఏ సినిమా చేసిన అది మినిమం గ్యారంటీ హిట్ అవుతుంది. అతని సినిమాపై ప్రొడ్యూసర్స్ ఎంత ఖర్చు పెడతారో అంత వెనక్కి తీసుకుని రావడం నాని స్పెషాలిటీ. మరి అతనితో సినిమా చేయడానికి ఏ డైరెక్టర్.. ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకోడు చెప్పండి!

యువ మ్యూజిక్ డైరెక్టర్ ను పట్టేశారు

ప్రస్తుతం నాని చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'జెర్సీ'. ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ. అయితే మరి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అనుకుంటున్న సమయంలో తెరపైకి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు వచ్చింది. అదేనండి కోలీవుడ్ లో యూత్ లో.. మాస్ లో మంచి ఆదరణ ఉన్న అనిరుధ్ ను సినిమాకి ఎంపిక చేశారట.

ఎట్టకేలకు 80 లక్షలకు...

ఇతని ప్రతీ ఆల్బం కొత్తగా ఉంటుంది. అందుకే అతనికి డిమాండ్ కూడా ఎక్కువ. అందుకేనేమో 'జెర్సీ' సినిమా చేయడానికి 1 కోటి 20 లక్షల రూపాయలను పారితోషికంగా డిమాండ్ చేశాడట. కానీ మన ప్రొడ్యూసర్స్ తెలివైన వాళ్లు కదా..ఆయనను రిక్వెస్ట్ చేయడంతో 80 లక్షలకి చేయడానికి ఆయన అంగీకరించినట్టుగా చెబుతున్నారు. తమిళ లోనే కాదు తెలుగులో కూడా అనిరుధ్ కి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. రీసెంట్ గా అయన 'అజ్ఞాతవాసి' ఇచ్చిన పాటలు అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Similar News