ఒకే రోజు వస్తున్న ఇద్దరు హీరోలు

వరుణ్ తేజ్ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 13 న ఈమూవీ ని రిలీజ్ [more]

Update: 2019-08-09 07:00 GMT

వరుణ్ తేజ్ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 13 న ఈమూవీ ని రిలీజ్ చేయనున్నారు. ఇందులో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు. కాగా ఈసినిమా కి పోటీగా నాని రానున్నాడు.

గ్యాంగ్ లీడర్ కూడా….

అదే రోజు అంటే సెప్టెంబర్ 13 న నాని – విక్రమ్ కుమార్ మూవీ గ్యాంగ్ లీడర్ రిలీజ్ కానుంది. మొదట ఈమూవీ ఆగష్టు 30 న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ అదే రోజు ప్రభాస్ ‘సాహో’ ఫిక్స్ చేసుకోవడంతో, ‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13కి వెళ్లింది. నిన్న నాని చేసిన ట్వీట్ తో గ్యాంగ్ లీడర్ ఆగస్టు 30 న రిలీజ్ కావడంలేదు అని అర్ధం అయిపోయింది.

వాల్మీకి పోటీ కాదని….

‘సాహో’ సినిమాని పొగుడుతూ గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం అని ట్వీట్ చేసాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 13 న రావడానికి నాని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. పైగా రెండు సినిమాలు పూర్తి భిన్నమైనవి కావడంతో ఒకదానితో ఒకటికి సంబంధం లేదు కాబట్టి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Tags:    

Similar News