భారీ బడ్జెట్ ని మొదలెడుతున్నాడు..!

నాని వరుస డిజాస్టర్స్ తరువాత జెర్సీ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి [more]

Update: 2019-03-13 08:38 GMT

నాని వరుస డిజాస్టర్స్ తరువాత జెర్సీ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19న విడుదల అవుతున్న ఈ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని మొదలుపెట్టాడతడు. ఈ చిత్రం షూటింగ్ చకచకా జరుపుకుని ఆగస్టులో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇక విక్రమ్ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నాడు నాని. ఇందులో సుధీర్ బాబు హీరో. ఇక్కడ అసలు విషయం ఏంటంటే నాని హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా పట్టాలెక్కబోతోంది అనే విషయం టాలీవుడ్ సీనియర్ పీఆర్వో ఒకరు ట్విట్టర్ లో వెల్లడించారు.

హైదరాబాదీ బ్యూటీతో…

ఇందులో నాని సరసన హైదరాబాదీ అమ్మాయి అదితీ రావు హైదరి నటించనుందట. సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీకి నాని లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడం అంటే మాములు విషయం కాదు. అయితే ఓ సెన్సేషనల్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. భారీ బడ్జెట్ అని కూడా చెప్పారు. అయితే మరి ఆ సెన్సషనల్ డైరెక్టర్ ఎవరు? అసలు సినిమా బడ్జెట్ ఎంతో మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

Tags:    

Similar News