దీనికెందుకు ఒప్పున్నట్లో...!!

Update: 2018-04-14 08:00 GMT

యంగ్ హీరోస్ అందరదీ ఒకదారి అయితే నాని ఒక్కడిదే ఒకదారి. యంగ్ హీరోలకు రెండు సినిమాలు హిట్ అయ్యాయి అంటే... మూడో సినిమా ప్లాప్ తో మార్కెట్ పడిపోతుంది. కానీ నానికి అలా కాదు నాని సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కళ్లుచెదిరే కలెక్షన్స్ రాబట్టడం ఒక్క నానికే సొంతం. స్టార్ హీరోలకు కూడా లేని క్రేజ్ నానికి ఉంది. అందుకే యావరేజ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఎంసీఏ కి వచ్చాయి. సినిమా ఎలా ఉన్నా నాని తన నటనతో సినిమాకి హిట్ కళ తీసుకొస్తాడు అనేది జగమెరిగిన సత్యం. నాని సినిమాలు ప్లాప్ అయినా.. నటుడిగా ప్రేక్షకులు నానికి ఫుల్ మార్కులు వేసేస్తారు.

తేలిపోయాడే.....

అలాంటిది నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలో అర్జున్ పాత్రని ఎలా అంగీకరించాడో అనేది మాత్రం అంతుబట్టడం లేదు. ఎందుకంటే నాని నటించిన కృష్ణార్జున యుద్ధం లో ఒక పాత్రలో కృష్ణ గా చెలరేగిపోయి మాస్ కుర్రాడిలా నటించిన నాని... మరో పాత్ర అర్జున్ పాత్రలో మాత్రం తేలిపోయాడనే కామెంట్స్ ఒక్క క్రిటిక్స్ దగ్గర నుంచే కాదు.. ప్రేక్షకుల దగ్గర నుండి కూడా వచ్చాయి. ప్లే బాయ్ పాత్రలో రాక్ స్టార్ గా నాని అర్జున్ పాత్ర ఆకట్టుకోలేక కృష్ణ పాత్ర ముందు తేలిపోయింది. అలాగే నాని పెట్టుకున్న నమ్మకాన్ని కృష్ణార్జున సినిమా ఫలితం వమ్ము చేసిందనే చెప్పాలి.

పేలవమైన పాత్రలో....

ఎందుకంటే గత గురువారమే విడుదలైన కృష్ణార్జున యుద్దానికి డివైడ్ టాక్ వచ్చినా ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం దారుణంగా వచ్చాయి. నాని గత చిత్రం ఎంసీఏకు కూడా ఇలాంటి టాకే వచ్చినప్పటికీ.. ఆ చిత్రానికి కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక కృష్ణార్జున యుద్ధం సినిమాకి వసూళ్ల సంగతి పక్కన పెడితే.. నాని మొదటిసారి అర్జున్ పాత్ర చేసి నటుడిగా ఫెయిలయ్యాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక నాని అర్జున్ పాత్రలో ఒక విగ్గు పెట్టి కొత్తగా కనిపించడానికి ట్రై చేశాడు కానీ.. అది పేలవంగా అనిపించింది. అసలా పాత్రలో ఎలాంటి కొత్తదనం లేదు. మరలాంటప్పుడు నాని ఆ పాత్రని ఎందుకు ఒప్పుకున్నట్లో అంటున్నారు.

Similar News