సాడ్ ఎండింగ్ ఏంటి నాని..?

తమ అభిమాన హీరోలు సినిమాల్లో చేసే పాత్రలు చాలా ఎనర్జిటిక్ గా, హీరోయిజాన్ని చూపిస్తూ యాక్షన్ సన్నివేశాలతో, డాన్స్ తో ఇరగదీయాలని అనుకుంటారు ఆయా హీరోల అభిమానులు. [more]

Update: 2019-03-28 07:56 GMT

తమ అభిమాన హీరోలు సినిమాల్లో చేసే పాత్రలు చాలా ఎనర్జిటిక్ గా, హీరోయిజాన్ని చూపిస్తూ యాక్షన్ సన్నివేశాలతో, డాన్స్ తో ఇరగదీయాలని అనుకుంటారు ఆయా హీరోల అభిమానులు. కానీ అదే హీరో పాత్ర సినిమాలో గనుక మరణిస్తే అస్సలు తట్టుకోరు. అందుకే టాలీవుడ్ దర్శకులు హీరోలను హీరోలుగానే చూపిస్తారు కానీ ఎక్కడా ఎవరినీ చంపరు. జై లవ కుశలో జై క్యారెక్టర్ చనిపోయినా.. లవ కుశలు ఎన్టీఆర్ రూపంలో బ్రతికే ఉంటారు కాబట్టి ఎన్టీఆర్ ఫాన్స్ ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకున్నారు. ఇకపోతే నేచురల్ స్టార్ నానీ జెర్సీ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నాని – శ్రద్ద శ్రీనాధ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో ఉంటుంది.

రెండు క్లైమాక్స్ లు అనుకున్నా…

ఈ సినిమాలో క్రికెటర్ గా నాని స్టిల్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. మరి మంచి అంచనాలున్న జెర్సీ సినిమాలో సాడ్ ఎండింగ్ ఉంటుందని టాక్ వినబడుతుంది. జెర్సీ సినిమాలో దర్శకుడు రెండు క్లైమాక్స్ లు రెడీ చేసాడని.. అయితే ఆ రెండు క్లైమాక్స్ లో ఏది బాగుంటే అది ఉంచుతారంటూ గతంలోనూ వార్తలొచ్చాయి. ఆ క్లైమాక్స్ లలో ఒకటి పాజిటివ్ గా, రెండోది నెగెటివ్ గా ఉంటుందట. తాజాగా నెగెటివ్ క్లైమాక్స్ కే జెర్సీ టీం మొగ్గు చూపింది. జెర్సీ సినిమాలో దాదాపుగా సాడ్ ఎండింగ్ ఉండబోతుందనేది ఇప్పుడు బయటికొచ్చిన టాక్. మరి నేచురల్ స్టార్ అభిమానులు ఈ వార్తనేలా తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News