నాని సరసన మహేశ్ హీరోయిన్...?

Update: 2018-06-19 11:35 GMT

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని బాగానే ఇరుక్కున్నాడు. ఒక పక్క కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్. మరోపక్క బిగ్ బాస్ హోస్టింగ్ కి నాని తగిన న్యాయం చేయడం లేదని టాక్. వరస విజయాలతో ఉన్న నానిని కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ బ్రేక్ వెయ్యడం ఒక ఎత్తైతే... గ్రాండ్ గా టివి షోకి ఎంట్రీ ఇస్తే అది కాస్తా ప్లాప్ అయ్యే పరిస్థితితో నాని ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం నాని బిగ్ బాస్ షోతో పాటుగా నాగార్జున తో కలిసి శ్రీరామ్ డైరెక్షన్ లో ఒక మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తో మళ్ళి హిట్ కొట్టి నిలదొజెక్కుకోవాలని చూస్తున్నాడు. ఇక సినిమా సినిమా కి గ్యాప్ ఇవ్వకుండా బిజీ షెడ్యూల్ చూసుకునే నాని... మల్టీస్టారర్ సెట్స్ మీదుండగానే.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో జెర్సీ సినిమాని మొదపెట్టాడు.

క్రికెటర్ గా మారనున్న నాని...

మళ్లీ రావా సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో నాని జెర్సీ అనే క్రీడా నేపధ్యమున్న కథతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ లోగోని కూడా ఎనౌన్స్ చేసిన నాని.. ఈ సినిమాతో హిట్ కొట్టెలనే కసితో ఉన్నాడు. క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ తో కొనసాగే ఈ సినిమా కోసం నాని క్రికెటర్ అవతారమెత్తుతున్నాడు. అయితే ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ వేట మొదలైందని... నాని పక్కన నటించే హీరోయిన్ ని సెట్ చెయ్యడం కాస్త క్లిష్టంగా మారిందంటున్నారు. అయితే నాని కోసం ఈ సినిమా లో మహేష్ పక్కన శ్రీమంతుడితో హిట్ కొట్టి.. పవన్ పక్కన కాటమరాయుడు తో ప్లాప్ అందుకున్న శృతి హాసన్ ని ఎంపిక చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

శృతి హాసన్ కి కలిసి వచ్చేనా...?

మరి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న శృతి హాసన్ ఆ మధ్యన పెళ్లి చేసుకుంటుందన్నారు. కానీ ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ తో శృతి అస్సలు కనబడడం లేదు. అయితే మళ్లీ సినిమాల అవకాశాల కోసం సన్నగా తయారైంది. మరి నాని సినిమాలో మళ్లీ అవకాశం వస్తే తన రీ ఎంట్రీ తో హిట్ కొట్టి తర్వాత స్టార్ హీరోల సరసన సినిమాలు చేజిక్కించు కోవాలనుకుంటుంది. అయితే ప్లాప్ లో ఉన్న అవకాశాలు లేని శృతి హాసన్ ని నాని జెర్సీ లో హీరోయిన్ గా ఒప్పుకుంటాడా..లేదంటే ఫ్రెష్ ఫేస్ కావాలంటాడో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Similar News