చైతు కన్నా నానికి తక్కువా..?

నాగ చైతన్య హ్యాట్రిక్ డిజాస్టర్స్ త‌ర్వాత‌ మొన్ననే మజిలీ సినిమాతో హిట్ అందుకున్నాడు. మజిలీ సినిమా హిట్ తో చైతు మళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇక [more]

Update: 2019-04-20 08:24 GMT

నాగ చైతన్య హ్యాట్రిక్ డిజాస్టర్స్ త‌ర్వాత‌ మొన్ననే మజిలీ సినిమాతో హిట్ అందుకున్నాడు. మజిలీ సినిమా హిట్ తో చైతు మళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇక నాని గత ఏడాది కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ తర్వాత నిన్న విడుదలైన జెర్సీ సినిమాతో హిట్ అందుకున్నాడు. నాని మార్కెట్ తో పోలిస్తే.. చైతు మార్కెట్ తక్కువనే చెప్పాలి. నాని ఏడెనిమిది సినిమాల తర్వాత ఒక ఫ్లాప్ కొట్టాడు. అయితే మజిలీ సినిమా ఫస్ట్ డే చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధిస్తే.. నాని జెర్సీతో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాడు. అయితే చైతు, నాని ఇద్దరు క్రికెట్ బ్యాగ్డ్రాప్ ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మజిలీలో ప్రేమ కోసం క్రికెట్ ని వదిలేసి… చివరికి కోచ్ గా మారతాడు హీరో. కానీ జెర్సీలో హీరో కెరీర్ లో క్రికెట్ వదిలేసి పెళ్లి చేసుకుని.. ఉద్యోగం కోల్పోయి… కొడుకు కోసం మళ్లీ క్రికెట్ లో నిలదొక్కుకుని సక్సెస్ అవడం వంటి వాటిని చూపించారు దర్శకులు.

జెర్సీని దెబ్బ‌కొట్టిన నాని

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు చిత్రాలు మొదటిరోజు మంచి కలెక్షన్స్ సాధిస్తే.. యుఎస్ ప్రీమియర్స్ లో మాత్రం మజిలీ సినిమాని నాని జెర్సీ క్రాస్ చెయ్యలేకపోయింది. మ‌జిలి యూఎస్ ప్రీమియ‌ర్ షోలతో 1,63,000 డాల‌ర్లు వ‌సూలు చేస్తే…. జెర్సీ మాత్రం 132 లొకేష‌న్ల‌లో కేవ‌లం 143,632 డాల‌ర్ల‌ను మాత్ర‌మే ప్రీమియ‌ర్ షోల ద్వారా రాబ‌ట్టగ‌లిగింద‌ని ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. అయితే నానికి ఓవర్సీస్ లో మంచి మర్కెట్ ఉన్నప్పటికీ… జెర్సీ కి యుఎస్ ప్రీమియర్స్ లో కాస్త వెనకబడడానికి కాంచన 3 నే కారణమట. కాంచన సీరీస్ తో రాఘవ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పించడంతో కాంచన 3పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి రావడంతోనే జెర్సీకి కలెక్షన్స్ తగ్గాయట. అయితే ఫైనల్ గా జెర్సీ ముందు కాంచన 3 తుస్సుమంది.

Tags:    

Similar News