చిరంజీవి తరహాలో నాని?

Update: 2018-06-17 07:21 GMT

సినిమాల విషయంలో సీక్వెల్స్ ఎలా వర్క్ అవుట్ అవ్వవో..రియాలిటీ షోస్ సీక్వెల్స్ కూడా వర్క్ కావు అని అర్ధం అవుతుంది. గతంలో స్టార్ మా వాళ్లు నాగార్జునని హోస్ట్ గా పెట్టి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నడిపించారు. ఆ ప్రోగ్రామ్ కి చాలా మంచి పేరు వచ్చింది. నాగ్ యాంకరింగ్ కూడా చాలా బాగుందని అంత పొగిడారు. ఆ తర్వాత కొత్త సీజన్ స్టార్ట్ అయినప్పుడు నాగార్జున నుంచి చిరంజీవి చేతుల్లోకి మారింది. చిరు చేసిన ఆర్టిఫిషియల్ యాంకరింగ్ దానికి మైనస్ గా నిలవడంతో ఆ షో గురించి భవిష్యత్తులో ఆలోచించడానికి కూడా స్టార్ మా వెనుకడుగు వేసేదాకా వచ్చింది.

అదేవిధంగా బిగ్ బాస్ 2 విషయంలో కూడా అదే జరిగేటట్టు ఉంది. నాని హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి పెద్ద ఆదరణ లభించడంలేదు. సరిగా వారం రోజులు కింద స్టార్ట్ అయిన ఈ షో స్టార్టింగ్ పర్లేదు అనిపించుకున్న తరవాత రాను రాను ఇది భరించలేని ప్రహసనంగా మారుతోంది. ఏదైనా జరగొచ్చు.. ఇంకొంచం మసాలా అని చెప్పడం.. కానీ షోని ఉప్పు లేని పప్పులాగా నడిపిస్తున్న తీరు మీద ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి.

న్యాచురల్ స్టార్ నాని తన న్యాచురల్ యాంకరింగ్ తో ఎన్టీఆర్ ని గుర్తుకు చేయకుండా చేస్తాడేమో అని చూస్తే.. ఎన్టీఆర్ తో పోలిక లేకుండా ఆడియన్స్ షోను చూడలేకపోతున్నారు. ముఖ్యంగా నాని ఆర్టిఫిషల్ యాంకరింగ్ చేస్తునట్టు అర్ధం అవుతుంది. నాని కూడా చిరంజీవిలా జస్ట్ పాస్ బ్యాచ్ లో చేరేలా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే.. నాని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో..ఆ స్ట్రెస్ లో నాని బిగ్ బాస్ 2 గురించి ఎక్కువ వర్క్ అవుట్ చేసుకోకుండానే నేరుగా టీమ్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చదువుకుంటూ వెళ్తూ ఉద్దేశాన్ని దెబ్బ తీస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది ఇలానే కొనసాగితే స్టార్ మా కు రేటింగ్స్ పడిపోయే అవకాశం ఉంది. సో మరి నెక్స్ట్ వీక్ నుండి ఏమైనా బాగా వర్క్ అవుట్ చేసి టెలికాస్ట్ చేస్తారో చూడాలి.

Similar News