నాని హీరోయిన్ పంట పండినట్టేనా..?

కన్నడలో ‘యూటర్న్’ సినిమాతో హిట్ కొట్టి తెలుగులో నానితో జెర్సీ సినిమాతో పరిచయమై సక్సెస్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈమె సహజ [more]

Update: 2019-05-28 07:39 GMT

కన్నడలో ‘యూటర్న్’ సినిమాతో హిట్ కొట్టి తెలుగులో నానితో జెర్సీ సినిమాతో పరిచయమై సక్సెస్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈమె సహజ నటన చూసే ఈ అమ్మడికి జెర్సీ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీతో సక్సెస్ అందుకున్న శ్రద్ధా నటన, గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో మన దర్శకనిర్మాతలు ఈ అమ్మాయిని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు.

కొరటాల సినిమాలోనూ…

సైరా తరువాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా అనుష్క పేరు పరిశీలిస్తున్నారు. మరో కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజం అయితే ఆమె పంట పండినట్టే. ఏ విషయం అన్నది త్వరలోనే తెలియనుంది.

Tags:    

Similar News