శ్రీకాంత్ పల్లెటూరి కథతో నానిని మెప్పించాడా..!

Update: 2018-10-27 06:40 GMT

కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ ఫ్లాప్స్ తో అసహనంగా ఉన్న హీరో నాని... గౌతమ్ తిన్నసూరి డైరెక్షన్ లో జెర్సీ అనే క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ తో నాని బిజీ అయ్యాడు. కృష్ణార్జున యుద్ధం సినిమా పోయినా.. నాగార్జునతో చేసిన దేవదాస్ హిట్ అవుతుందనుకున్న నానికి దేవదాస్ కూడా ఫ్లాప్ అయ్యేసరికి ఈసారి చేసే జెర్సీ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇక దేవదాస్ తో పాటు బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ చేసిన నాని అక్కడా సక్సెస్ కాలేక పోయాడు. ఇక జెర్సీ తర్వాత నాని మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ.. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో మాత్రం ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ ఒక న్యూస్ అయితే ఒక వారం పది రోజుల నుండి సోషల్ మీడియాలో వినబడుతుంది. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత కనబడకుండా పోయిన శ్రీకాంత్ అడ్డాల ఒక ప్రేమ కథ చిత్రం చేయబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. అయితే శ్రీకాంత్ అడ్డాలతో గీత ఆర్ట్స్ లో నాని హీరో గా సినిమా నిజమే అని... కొత్తదనం కోరుకునే నాని శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథాకథనాల్లో కొత్తదనం .. పాత్రల్లోని వైవిధ్యం కారణంగా శ్రీకాంత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వచ్చింది

గ్రామీణ నేపథ్యంతో...

అయితే ఆ కథ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అనేది తాజా సమాచారం. పల్లెటూరి యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపిస్తాడనీ.... ఫ్యామిలీ ఎమోషన్స్ తోనే కథ నడుస్తుందని అంటున్నారు. మరి శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు రెండు పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలే. మరి ఆ రెండు సినిమాలు హిట్స్. కానీ సిటీ కల్చర్ తో చేసిన బ్రహ్మోత్సవం ఫ్లాప్. అసలు నాని కథలో కొత్తదనం ఉన్నప్పటికీ.. ఇలా ఫ్లాప్ డైరెక్టర్ కి ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అనేది ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్నే. ఏది ఏమైనా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మడం కష్టమే.

Similar News