నాని డైరెక్టర్ తో శర్వా..!

టాలీవుడ్ లో చాలామంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారు కానీ ఎక్కువ మంది సక్సెస్ కాలేదు. కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అందులో ఒక్కరు భ‌లే మంచి రోజుతో [more]

Update: 2019-05-25 08:03 GMT

టాలీవుడ్ లో చాలామంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారు కానీ ఎక్కువ మంది సక్సెస్ కాలేదు. కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అందులో ఒక్కరు భ‌లే మంచి రోజుతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అయినా శ్రీ‌రామ్ ఆదిత్య‌. ఈ మూవీతో శ్రీరామ్ పర్లేదు అనిపించుకున్నాడు. ఈ మూవీ తర్వాత శ్రీరామ్ వెంటనే శ‌మంత‌క‌మ‌ణితోనూ ఆక‌ట్టుకున్నాడు. దీని తరువాత నాగ్, నాని లాంటి టాలెంటెడ్ హీరోస్ తో వర్క్ చేసే ఛాన్స్ కొట్టేసాడు శ్రీరామ్. నాగ్, నాని ల తో చేసిన మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్‌' ఓకే అనిపించుకుంది.

కథ ఓకే చేయించుకున్న శ్రీరామ్

ఇప్పుడు మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈసారి ఫ్లాప్ హీరోతో. అవును ఈ డైరెక్టర్ శ‌ర్వానంద్ కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడ‌ట. రీసెంట్ గా ఆయనకు లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అది కూడా సింగిల్ సిట్టింగ్‌తోనే క‌థ ఓకే చేయించుకున్నాడ‌ని తెలుస్తోంది. ప్రస్తుతం శర్వా.. సుధీర్ వర్మ డైరెక్షన్ లో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. దీనికి 'ద‌ళ‌ప‌తి' అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ మూవీ తరువాత శ్రీరామ్ ఉంటుంది. నిర్మాతలు ఎవరో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News