టాక్ తో సంబంధం లేదు

టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది గ్యాంగ్ లీడర్. నాని గ్యాంగ్ లీడర్ జస్ట్ యావరేజ్ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ అన్నప్పటికీ… గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ మీద [more]

Update: 2019-09-16 07:14 GMT

టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది గ్యాంగ్ లీడర్. నాని గ్యాంగ్ లీడర్ జస్ట్ యావరేజ్ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ అన్నప్పటికీ… గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ మీద ఆ టాక్ ఎలాంటి ప్రభావం చూపలేదు. నాని క్రేజ్ తో సినిమా ఇరగదీస్తోంది. సాహో లాంటి బిగ్ మూవీ కూడా ప్రేక్షకులను అలరించకపోవడం, గత వారం సరైన సినిమాలేవీ లేకపోవడం తో ప్రేక్షకులు గ్యాంగ్ లీడర్ కే ఓటేశారు. అందుకే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. ఫస్ట్ వీకెండ్ లోనే గ్యాంగ్ లీడర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదకొండున్నర కోట్లు కొల్లగొట్టడం అనేది నాని క్రేజ్ కి నిదర్శనం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

ఏరియా షేర్ (కోట్లలో)

నైజాం 4.67

సీడెడ్ 1.49

నెల్లూరు 0.35

కృష్ణ 0.93

గుంటూరు 1.03

వైజాగ్ 1.56

ఈస్ట్ గోదావరి 1.06

వెస్ట్ గోదావరి 0.64

టోటల్ ఏపీ & టీస్ షేర్ 11.73

 

 

Tags:    

Similar News