ఈ ఫోటోతో నందమూరి ఫ్యాన్స్ కి పండుగే

Update: 2018-07-06 08:25 GMT

గత కొంతకాలం నుండి ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ల మధ్య అనుబంధం ఎక్కువైందనే చెప్పాలి. ఏ ఈవెంట్స్ కి వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్లడం..ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు గెస్ట్ లు గా వెళ్లడం.. ఒకరు బర్త్ డేలు మరొక్కరు సెలెబ్రేట్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఈ పరిణామాలు నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. నిన్న కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య బర్త్ డేని ఘనంగా సెలబ్రేట్ చేశాడు. కళ్యాణ్ తో కేక్ కట్ చేయించి తినిపించాడు. ఈ ఫోటోలో ఎన్టీఆర్...కళ్యాణ్ రామ్ ల తో పాటు ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇద్దరూ సినిమాలతో బిజీగా...

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కేవీ గుహాన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ మూవీలో నివేదా థామస్ - షాలినీ పాండే కథానాయకులుగా నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్.. 'ఆరవింద సమేత' చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Similar News