మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడుగా..!

నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తెలుగుతెరపై హీరోగా 2017లోనే ఎంట్రీ ఇవ్వాలి. కానీ కొన్ని కారణాలు వల్ల తన ఎంట్రీ లేట్ అయింది. బాలకృష్ణ ప్రతి సినిమా [more]

Update: 2019-02-22 09:47 GMT

నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తెలుగుతెరపై హీరోగా 2017లోనే ఎంట్రీ ఇవ్వాలి. కానీ కొన్ని కారణాలు వల్ల తన ఎంట్రీ లేట్ అయింది. బాలకృష్ణ ప్రతి సినిమా ప్రమోషన్స్ అప్పుడు మీ కొడుకు ఎంట్రీ ఎప్పుడు అని మీడియా వాళ్లు అడుగుతున్నప్పుడు త్వరలోనే త్వరలోనే అని చెప్పి వెళ్లిపోయేవారు. దీంతో మీడియా వాళ్లు కూడా దీని గురించి అడగడం మానేశారు. ఇక మహానాయకుడు ప్రమోషన్స్ అప్పుడు బాలకృష్ణ తన కొడుకు అరంగేట్రం గురించి మాట్లాడాడు. మోక్షు లాంచింగ్ వచ్చే ఏడాది కచ్చితంగా ఉంటుందని బాలయ్య స్పష్టం చేశాడు. అయితే ఏ డైరెక్టర్ తో అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.

బోయపాటితోనే తర్వాతి సినిమా

అలానే బోయపాటి సినిమా గురించి కూడా మాట్లాడుతూ… తన నెక్స్ట్ మూవీ ముందు ప్రకటించినట్టుగానే బోయపాటితో ఉండబోతుంది అని చెప్పారు. కానీ షూటింగ్ కొంత సమయం పడుతుందని చెప్పాడు. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ నెలే స్టార్ట్ అవ్వాలి కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తుండటంతో ప్రచారంలో బిజీ అవుతానని అందుకే ఈ సినిమాను లేట్ గా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

Tags:    

Similar News