ఏంటి…‘ఎంత మంచివాడవయ్యా’ కథ కాపీయా?

అనిల్ రావిపూడి తో పటాస్ చేసి తన కెరీర్ ని ఒక గాడిలో పెట్టుకుని తన నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ పెట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్. [more]

Update: 2019-08-24 09:56 GMT

అనిల్ రావిపూడి తో పటాస్ చేసి తన కెరీర్ ని ఒక గాడిలో పెట్టుకుని తన నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ పెట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్. పటాస్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత వరస ఫ్లాపులతో చిరాకు తెప్పించాడు. గత ఏడాది ‘118’ సినిమా అతడికి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశమిచ్చింది.

ప్రస్తుతం కళ్యాణ్ ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’ డైరెక్టర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘ఎంత మంచివాడవయ్యా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పక్క ఫామిలీ ఎంటర్టైనర్. ఇది సతీశ్ వేగేశ్న గత సినిమాల మాదిరిగానే ఒరిజినల్ మూవీ అని అనుకున్నారంతా. కానీ కాపీ మూవీ అని తెలుస్తుంది. అవును ఇది గుజరాతీలో విజయవంతమైన ‘ఆక్సిజన్’ అనే సినిమా నుండి ఇన్ స్పైర్ అయ్యి తీస్తున్న సినిమా. కాకపోతే మూల కథ మాత్రమే తీసుకుని.. దానికి తనదైన ట్రీట్మెంట్ ఇస్తున్నాడట ఈ దర్శకుడు. ఎన్ని మార్పులు చేసిన కాపీ ని కాపీయే అంటారు. మరి మేకర్స్ ఆ సినిమా రైట్స్ తీసుకుని చేస్తున్నారా? లేదా? అనేది తెలియాలి.

ఈమూవీ తో ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణంలోకి అడుగు పెడుతోంది. కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ నటిస్తుంది. కళ్యాణ్ ఫ్యామిలి సినిమాలు చాలా తక్కువ చేసాడు కాబట్టి ఈసినిమాతో హిట్ ఎట్టిపరిస్థితుల్లో అందుకోవాలని చూస్తున్నాడు. ఈమూవీ సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

Tags:    

Similar News