ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ ముఖ్యమైన పాత్ర ?

Update: 2018-12-10 03:44 GMT

నందమూరి బాలక్రిష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలయ్య ను మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిగితే త్వరలోనే అని చెప్పాడు కానీ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇది ఇలా ఉండగా బాలయ్య ప్రస్తుతం' ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎలక్షన్స్ దగ్గర పడటంతో త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని తన నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు.

క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా యొక్క షూటింగ్ హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. రీసెంట్ గా ఆ సెట్స్ కి బాలక్రిష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సడెన్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ ఇచ్చాడట. భారీగా వేసిన ఆ సెట్స్ ని చూపించడానికి బాలక్రిష్ణ మోక్షజ్ఞ ని సెట్స్ కి తీసుకు వచ్చాడని చెబుతున్నారు. కానీ మీడియాలో మాత్రం మోక్షజ్ఞ 'ఎన్టీఆర్' బయోపిక్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇందులో మోక్షజ్ఞ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు అని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ మోక్షజ్ఞ 'ఎన్టీఆర్' బయోపిక్ సెట్స్ వెళ్ళింది మాత్రం వాస్తమే అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రెండు పార్ట్స్ గా ఈచిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే

Similar News