బాలయ్య ‘సామి స్క్వేర్’ రీమేక్ చేస్తున్నాడా?

Update: 2018-05-20 11:00 GMT

గతంలో మెగా స్టార్ చిరంజీవి ‘మున్నాభాయి ఎంబీబీఎస్’ హిందీ సినిమాను ఇక్కడ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ పేరుతో రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. మళ్లీ ఆ తర్వాత ‘మున్నాభాయ్’కి సీక్వెల్ తీస్తే దాన్ని కూడా మళ్లీ రీమేక్ చేసారు చిరంజీవి. కానీ ఆ సినిమా ఇక్కడ అనుకున్న స్థాయిలో ఆడలేదు.

అయితే ఒక్కప్పుడు తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సామి’ని బాలయ్య హీరోగా ‘లక్ష్మీనరసింహా’ పేరుతో తెలుగులో తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇక్కడ బాగానే ఆడింది. మళ్లీ ఇప్పుడు విక్రమ్ హీరోగా డైరెక్టర్ హరి ‘సామి స్క్వేర్’ తీస్తున్నాడు. ఇటీవలే దీని మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే మరి ఈ చిత్రాన్ని బాలయ్య రీమేక్ చేస్తాడా.. లేదా బాలయ్య కాకపోతే ఇంకెవరైనా ఈ రీమేక్ గురించి ఆలోచిస్తారా అన్న చర్చ మొదలైంది. కానీ అలాంటిది ఏమి లేదని తేలిపోయింది. ఆ సినిమాను డైరెక్ట్ గా తెలుగులోకి తెచ్చేస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. అంటే ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే తెలుగులో ఫస్ట్ లుక్ తో పాటు తెలుగు టైటిల్ కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే తెలుగులో కూడా తమిళ్ టైటిల్ పెడతారా లేదా వేరేది పెడతారా అన్న క్లారిటీ మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది. వచ్చే నెలలోనే ‘సామి స్క్వేర్’ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Similar News