అభిమాని ఐడియా నే కొంప ముంచిందా ?

బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఈ సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు. ప్రేక్షకుల నుండి, రివ్యూ రైటర్స్ [more]

Update: 2019-12-21 04:36 GMT

బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఈ సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు. ప్రేక్షకుల నుండి, రివ్యూ రైటర్స్ నుండి ఈ సినిమాకి ఓవరాల్ గా ప్లాప్ టాక్ పడింది. బాలయ్య స్టయిల్, ఆయన ఎనర్జీ నటన, డాన్స్ అన్ని ఫ్యాన్స్ మెచ్చేవిలా ఉన్నప్పటికీ…. పోలీస్ గెటప్, కథ, కథనం, డైరెక్షన్ వీక్ గా ఉండడంతో.. సినిమాకి ప్లాప్ టాక్ పడింది. అయితే బిజినెస్ మ్యాన్ గా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసిన బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ లుక్ లో మాత్రం నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. ఆ లుక్ లో బాలయ్య తేలిపోయాడు. అయితే రూలర్ సినిమాలో ఫ్రెంచ్ గడ్డంతో ఉన్న లుక్ విషయంలో తనకెలా ఐడియా వచ్చిందో బాలయ్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో లీక్ చేసాడు.

ఫ్రెంచ్ గడ్డంతో ఉన్న ఓ హాలీవుడ్ హీరో లుక్ ని ఓ అభిమాని తన వాట్స్ అప్ నెంబర్ కి పంపగా.. ఆ లుక్ చాలా నచ్చి ఆ ఫోటో ని బాలయ్య దాచుకున్నాడట. అయితే రూలర్ స్టోరీ ఫైనల్ అయ్యాక కె ఎస్ రవికుమార్ రూలర్ సినిమా లుక్స్ చెబుతున్నప్పుడు అభిమాని పంపిన ఫొటో గుర్తొచ్చి.. వెంటనే ఆ ఫ్రెంచ్ గడ్డంతో వున్న లుక్ ని ఫాలో అయిపోయా అని చెప్పాడు. మరి అభిమాని ఐడియాని అలా బాలయ్య కాపీ చేసేశాడన్నమాట. ఇకపోతే ఆదిత్య 999 తో తాను దర్శకుడిగా కూడా మారబోతున్నట్లుగా ఆ ఇంటర్వ్యూ లో రివీల్ చేసాడు బాలకృష్ణ.

Tags:    

Similar News