రూలర్ కి దబిడిదిబిడే

కథానాయకుడు, మహానాయకుడు సినిమాల దెబ్బతో ఉన్న బాలకృష్ణ కి మరో పక్క టిడిపి పార్టీ చుక్కాని లేని నావ లా కొట్టుకుపోవడానికి రెడీగా వుంది. అయితే సినిమాల [more]

Update: 2019-12-04 06:22 GMT

కథానాయకుడు, మహానాయకుడు సినిమాల దెబ్బతో ఉన్న బాలకృష్ణ కి మరో పక్క టిడిపి పార్టీ చుక్కాని లేని నావ లా కొట్టుకుపోవడానికి రెడీగా వుంది. అయితే సినిమాల విషయానికొస్తే.. జై సింహ లాంటి యావరేజ్ హిట్ తీసిన కె ఎస్ రవికుమార్ కి మళ్ళీ రూలర్ అనే సినిమాని అప్పజెప్పాడు బాలకృష్ణ. ఈ సినిమా కి హీరోయిన్స్ కూడా ఎలాంటి పేరున్న హీరోయిన్స్ కారు. వేదిక అవుట్ డేటెడ్ హీరోయిన్. సోనాల్ చౌహన్ అందాలు ఆరబోస్తుంది కానీ… నటనలో వీక్. డిసెంబర్ 20 న బాలకృష్ణ అంతో ఇంత క్రేజ్ ఉన్న సాయి ధరమ్ తోనూ, రాజ్ తరుణ్ తోనూ పెట్టుకోబోతున్నాడు. మరో పక్క చైతు – వెంకీ ల వెంకిమామ కి రూలర్ కి కేవలం వారం గ్యాప్ ఉంది.

ఇక బాలీవడ్ నుండి సల్మాన్ హిట్ సీరీస్ దబాంగ్ 3 తో పోటీకి రావడం, ఖైదీ హిట్ తో ఉన్న కార్తీ దొంగ తో రావడం చూస్తుంటే.. రొటీన్ స్టోరీ తో వస్తున్న బాలకృష్ణ కి బ్యాండ్ బాజా మోగడం ఖాయంగా కనబడుతుంది. రూలర్ టీజర్ కానీ, సాంగ్స్ కానీ రొటీన్ గా ఉండడంతో.. బాలయ్య సినిమా బిజినెస్ కూడా అనుకున్నంతగా సాగడం లేదని ట్రేడ్ టాక్. నాలుగైదు సినిమాల మీద పోటీకి వస్తున్న బాలయ్య రూలర్ కి యావరేజ్ టాక్ పడినా కష్టమే అంటున్నారు. మరి ఈసారి బాలకృష్ణ కి దబిడిదిబిడి ఖాయంగానే కనబడుతుంది.

Tags:    

Similar News