బాలయ్య కూడా ఊహించి ఉండడుగా

బాలకృష్ణ రూలర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంది రూలర్ కలెక్షన్స్ చూస్తుంటే. మొదటి రోజు బాలయ్య స్టామినాతో మంచి కలెక్షన్స్ సాధించిన [more]

Update: 2019-12-23 07:47 GMT

బాలకృష్ణ రూలర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంది రూలర్ కలెక్షన్స్ చూస్తుంటే. మొదటి రోజు బాలయ్య స్టామినాతో మంచి కలెక్షన్స్ సాధించిన రూలర్ సినిమా కలెక్షన్స్ రెండో రోజు దారుణంగా పడిపోయాయి. ఇక ఫస్ట్ వీకెండ్ లో రూలర్ సినిమా కలెక్షన్స్ బాలయ్య బాబు కూడా ఊహించి ఉండడు. రోజు రోజుకి డ్రాపవుతున్న రూలర్ కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.11 కొల్లగొట్టగా.. వరల్డ్ వైడ్ గా 6.91 కోట్లు తో ఉసూరుమనిపించారు. మరి రూలర్ కొన్న బయ్యర్లు ఇప్పటికే ఘొల్లుమంటున్నారు. మరి రూలర్ కి పెట్టిన పెట్టుబడిలో కనీసం నాలుగోవంతు కూడా వచ్చేలా కనిపించడం లేదు.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 1.28
సీడెడ్ 1.68
నెల్లూరు 0.30
కృష్ణ 0.31
గుంటూరు 1.34
వైజాగ్ 0.48
ఈస్ట్ గోదావరి 0.37
వెస్ట్ గోదావరి 0.35
టోటల్ ఏపీ & టీస్ షేర్ 6.11
ఇతర ప్రాంతాలు 0.60
ఓవర్సీస్ 0.20

టోటల్ వీకెండ్ కలెక్షన్స్: 6.91 కోట్లు

Tags:    

Similar News