నందమూరి న్యూ లుక్

నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో [more]

Update: 2019-08-20 13:10 GMT

నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. గడ్డం, మీసంతో ఉన్న లుక్‌లో బాలయ్యను చూసి థ్రిల్ అవుతున్నారు. మంగళవారం నుండి లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.

Tags:    

Similar News