బాలయ్య అదిరిపోయాడు

తన పర్సనాలిటీ విషయం పక్కన పెడితే బాలయ్య తన మేకోవర్ విషయంలో ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తూనే ఉంటాడు. ఏదొక విధంగా తన స్టైల్ ని మార్చుకుని చాలా [more]

Update: 2019-08-20 08:03 GMT

తన పర్సనాలిటీ విషయం పక్కన పెడితే బాలయ్య తన మేకోవర్ విషయంలో ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తూనే ఉంటాడు. ఏదొక విధంగా తన స్టైల్ ని మార్చుకుని చాలా కొత్తగా కపిస్తుంటాడు బాలకృష్ణ. లావు గురించి పక్కన పెడితే నిన్న బయటకు వచ్చిన లుక్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు.

మొన్నటివరకు పెద్ద మొహం తో, భీకరమైన గెడ్డంతో కనిపిస్తూ వచ్చాడు బాలకృష్ణ. ఎన్నికలు సమయంలో ఫుల్ షేవ్ చేసి కుర్రోడిలా మారాడు. కానీ నిన్న వచ్చిన లుక్ తో ఔరా! అనేలా చేస్తున్నాడు. చిత్రమైన గెడ్డం, పైకి దువ్విన క్రాఫ్ తో బిలో మిడిల్ ఏజ్డ్ లుక్ లోకి వచ్చేసాడు బాలయ్య.

ఇటువంటి స్టిల్ బాలకృష్ణ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ లుక్ తన కొత్త సినిమా కోసం. కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో సి కళ్యాణ్ నిర్మించే సినిమా కోసమే ఈ గెటప్, ఈ మేకోవర్ అంత. ఇంకా లావు గురించి అయితే బాలయ్య బోయపాటికి మాట ఇచ్చాడట. తనతో సినిమా చేసే టైం కళ్ళ లావు తగ్గి స్లిమ్ గా మారతానని. ఒకవేళ బాలయ్య లావు తగ్గితే ఫ్యాన్స్ ని ఆపలేం.

Tags:    

Similar News