బాలయ్య ఇక తప్పుకుంటే బెటర్..!

బాలకృష్ణకి ఫ్లాప్స్ కొత్తేమీ కాదు. తన కెరీర్ స్టార్టింగ్ లోనే ఎన్నో డిజాస్టర్స్ చూసాడు. ఆ టైంలో కూడా బాలయ్య నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత మహారథి, ఒక్క [more]

Update: 2019-03-01 07:35 GMT

బాలకృష్ణకి ఫ్లాప్స్ కొత్తేమీ కాదు. తన కెరీర్ స్టార్టింగ్ లోనే ఎన్నో డిజాస్టర్స్ చూసాడు. ఆ టైంలో కూడా బాలయ్య నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు లాంటి డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. వాటి తర్వాత బోయపాటి వచ్చి బాలయ్యకు సూపర్ హిట్ చిత్రం సింహ ఇచ్చాడు. అప్పుడు మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. సింహ తరువాత రెండు మూడు డిజాస్టర్స్ వచ్చినా కృంగిపోలేదు. వెంటనే మళ్లీ బోయపాటి లెజెండ్ సినిమాతో ఇంకో హిట్ ఇచ్చాడు. ఇక, రీసెంట్ గా వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ఇంకా బాలయ్యని తట్టుకోవడం కష్టమే అని అర్ధం అయిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలను సామాన్య ప్రేక్షకుల కంటే ముందు నందమూరి అభిమానులే తిరస్కరించారు.

కొడుకును దింపితే బెటర్…

ఇది ఎన్టీఆర్ బయోపిక్ అయినప్పటికీ, నందమూరి అభిమానులు మహానాయకుడుని పట్టించుకోకపోవడంతో బాలయ్య కెరీర్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఇక బాలయ్య సినిమాల నుండి తప్పుకొని తన కొడుకుని రంగంలోకి దింపితే బెటర్ అని సలహాలు వినిపిస్తున్నాయి. మరి ఇవి బాలయ్య పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బోయపాటితో ప్లాన్ చేసుకున్నాడు. ఎన్నికల తరువాత ఈ చిత్రం స్టార్ట్ కానుంది. చూద్దాం బాలయ్య ఈ సినిమాతో అయినా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో.

Tags:    

Similar News