ఆ ఈవెంట్ లో బాలయ్య ఏం మాట్లాడతాడో?

బాలకృష్ణ తన తండ్రి పాత్రని ఎంతో ఇష్టంగా చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద తంటాలు పడుతుంది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్టులుగా ఎన్టీఆర్ [more]

Update: 2019-02-25 03:25 GMT

బాలకృష్ణ తన తండ్రి పాత్రని ఎంతో ఇష్టంగా చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద తంటాలు పడుతుంది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్టులుగా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ పెట్టి ఎన్టీఆర్ బయోపిక్ ని స్వయానా బాలకృష్ణ నిర్మించాడు. అయితే కథానాయకుడు భారీ డిజాస్టర్ కాగా.. మహానాయకుడు సినిమా కూడా కథానాయకుడు తలతన్నే డిజాస్టర్ అయ్యేలా కనబడుతుంది…. మహానాయకుడు కలెక్షన్స్ చూస్తుంటే. మరి కథానాయకుడు అప్పుడు బాగా హడావిడి చేసిన బాలయ్య.. మహానాయకుడు అప్పుడు సైలెంట్ గా వున్నాడు. ఇక మహానాయకుడు విడుదలయ్యాక కూడా బాలయ్య ఎక్కడా మీడియాకి దొరకలేదు.

కానీ బాలకృష్ణ ఇప్పుడు మీడియాకి అడ్డంగా దొరికిపోతున్నాడు. అలాగే మహానాయకుడు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం భారీగా జరగబోయే కళ్యాణ్ రామ్ 118 మూవీ ప్రీ రిలీస్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరవుతున్నాడు. మరి కళ్యాణ్ రామ్ సినిమా ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ ఎక్కువగా మాట్లాడడానికి బాలకృష్ణ కే అవకాశమిస్తాడు. మరి 118 గురించి కావాల్సింది మాట్లాడి.. చివరికి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు గురించి మాట్లాడాల్సి వస్తుంది. మరి బాలయ్య దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.అన్నట్టు ఈ 118 ఈవెంట్ కి తారక్ అదేనండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరవుతున్నాడు.

Tags:    

Similar News