ఈసారి అంత పవర్ ఫుల్ గా తియ్యవా బోయపాటి?

బోయపాటి సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుంది. కథానాయకుడు విలన్స్ ని కస కస నరుక్కుంటూ వెళ్లిపోవడం లాంటి సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే.. [more]

Update: 2019-11-01 06:29 GMT

బోయపాటి సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుంది. కథానాయకుడు విలన్స్ ని కస కస నరుక్కుంటూ వెళ్లిపోవడం లాంటి సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే.. బోయపాటి కేరాఫ్ ఊర మాస్ ఇలా ఉంటుంది ఆయన సినిమా. ఇక బాలకృష్ణ కి ఆ ఊర మాస్ కలిసొచ్చింది. కానీ రామ్ చరణ్ కి మాత్రం ఆ ఊర మాస్ దెబ్బేసింది. మరీ ట్రైన్ మీద నిలబడి జర్నీ చేయడాలు, తలలు నరికి గాల్లో తిప్పడాలు వంటి వాటిని ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అందుకే ఈసారి బాలయ్య సినిమాని పవర్ ఫుల్ గా తియ్యడం లేదని.. ప్రేక్షకులకు నచ్చే విధంగా బాలయ్య కథ ని బోయపాటి రాసుకున్నాడని అంటున్నారు.

తన సినిమాల్లో ఉండే అతి పవర్ ఫుల్ యాక్షన్ ని బోయపాటి తగ్గించుకుంటున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలను మరీ ఓవర్ గా తియ్యకుండా.. కాస్త ప్రేక్షకులు మెచ్చేలా తియ్యాలని డిసైడ్ అయ్యాడట. అయితే బోయపాటి ఈ అతి మాస్ ని తగ్గించుకోవడానికి బాలయ్య సలహానే కారణమంటున్నారు. బోయపాటి మాస్ యాక్షన్ ని తగ్గించుకోమని చెప్పాడట బాలయ్య. అసలు బోయపాటి ఆ యాక్షన్ వలనే బాలకృష్ణ కొన్నాళ్ళు దూరం పెట్టాడని, అందుకే బాలయ్య ఏం చెబితే అది చేసేందుకు బోయపాటి రెడీ అయ్యాడట. మరి బాలయ్య – బోయపాటి అంటే ఊర మాస్ అని ఫిక్స్ అయిన అభిమానులు ఈ న్యూస్ ని ఎలా జీర్ణించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News