లుక్ విషయంలో పట్టించుకోకపోతే ఎలా?

బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా ట్రైలర్ లో మాస్ కి మెచ్చే అంశాలు ఎన్నైతే ఉన్నాయో, బాలయ్య లుక్స్ విషయంలో అన్నే అంశాలు ట్రోల్ అవుతున్నాయి. రూలర్ [more]

Update: 2019-12-09 06:15 GMT

బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా ట్రైలర్ లో మాస్ కి మెచ్చే అంశాలు ఎన్నైతే ఉన్నాయో, బాలయ్య లుక్స్ విషయంలో అన్నే అంశాలు ట్రోల్ అవుతున్నాయి. రూలర్ సినిమాలో బాలయ్య లుక్ గెటప్, గెడ్డం, హెయిర్ స్టయిల్ చాలావరకు బావున్నప్పటికీ.. పోలీస్ గెటప్లో మాత్రం బాలకృష్ణ కామెడీ అయ్యాడు. పోలీస్ గెటప్ లో సూటవ్వని విగ్ తో బాలకృష్ణ కు అస్సలు బాగోలేదు. ఇప్పుడా గెటప్ చూసిన నందమూరి ఫ్యాన్స్ కి భయం పట్టుకుంది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ నటించి ప్లాప్ కొట్టిన చాలా సినిమాల్లో బాలకృష్ణ విగ్స్ కానీ, ఆయన గెటప్స్ కానీ సెట్ కానివీ ఉన్నాయి.

ఇప్పుడు రూలర్ లోను బాలయ్య పోలీస్ గెటప్ చూస్తుంటే ఫ్యాన్స్ కి అదే భయం పట్టుకుంది. అందుకే మరీ మాస్ మసాలా సీన్స్ కూడా సినిమాలో ఎక్కువై రొటీన్ కమర్షియల్ ఫార్మేట్ లోనే సినిమా ఉండబోతుంది అని రూలర్ ట్రైలర్ తో ఫిక్స్ అవుతున్నారు. రవికుమార్ జై సింహ విషయంలో దెబ్బేసిన మాదిరిగా రూలర్ విషయంలో బాలయ్య కి దెబ్బయ్యకపోతే పర్వాలేదంటున్నారు. పవర్ ఫుల్ టైటిల్ తో బాలకృష్ణ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నప్పటికీ.. బాలయ్య విగ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ బాగా వర్రీ అవుతున్నారు. కాకపోతే కొన్ని షాట్స్ లో బాలయ్య స్టైలిష్ అండ్ ఎనేర్జిటిక్ లుక్స్ మాత్రం సూపర్ అన్న రేంజ్ లో ఉన్నాయి

Tags:    

Similar News