అది నా గేమ్ చేంజ్ చిత్రంగా మలిచినందుకు థాంక్స్!!

నాగ చైతన్య కి చాలా సినిమాల ప్లాప్స్ తర్వాత సమంత తో కలిసి నటించిన మజిలీ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. పెళ్లి తర్వాత సమంత – [more]

Update: 2020-04-06 07:12 GMT

నాగ చైతన్య కి చాలా సినిమాల ప్లాప్స్ తర్వాత సమంత తో కలిసి నటించిన మజిలీ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. పెళ్లి తర్వాత సమంత – నాగ చైతన్య కలిసి నటించిన మజిలీ సూపర్ హిట్ అయ్యింది. మజిలీ సినిమా విడుదలై ఏడాది పూర్తయ్యింది. మజిలీ సినిమాలో నాగ చైతన్య మాస్ నటన, సమంత సాధారణ గృహినిగా ఇరగదీశారు. చైతూకి మజిలీ సినిమాతో కెరీర్ మల్లి ఊపందుకుంది. మజిలీ సినిమాలో చైతు రఫ్ గా గెడ్డం పెంచి.. క్రికెట్ ప్లేయర్ గా….. లవర్ గా, భర్త గా అదరగొట్టేస్తే… సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన సమంత మజిలీ సినిమాని తన నటనతో నిలబెట్టేసింది. రైల్వే జాబ్ చేస్తూ.. బాధ్యత లేని భర్తకి భార్యగా… భర్త ఎప్పటికైనా మరకపోతాడా అంటూ ఎదురు చూస్తూ. భర్తకే సపోర్ట్ చేసే భార్య గా అదరగొట్టేసింది.

అయితే మజిలీ సినిమా విడుదలై ఏడాది గడిచిన సందర్భంగా మజిలీ సినిమాకి సంబందించిన ఓ డీపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే…, నాగ చైతన్య మజిలీ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ ట్వీట్ పెట్టాడు. మజిలీ కి ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారికీ ధన్యవాదాలు. మజిలీని నా గేమ్ చేంజెర్ చిత్రంగా మార్చినందుకు అందరికి థాంక్స్… ఎప్పటికి మజిలీ చిత్రం నా మనసుకు, హృదయానికి దగ్గరగా ఉంటుంది…. అంటూ ట్వీట్ చేసాడు.

Tags:    

Similar News