భరత్ అనే నేను కోసం నమ్రత ప్రమోషన్ స్ట్రాటెజీ!!

Update: 2018-04-14 07:00 GMT

ఒక్కప్పుడు బాలీవుడ్ లో చాలా సినిమాలకి హీరోయిన్ గా యాక్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. కానీ నమ్రత గురించి అందరికి తెలియని విషయం ఇంకోటి ఉంది. ఆమె హీరోయిన్ గానే కాకుండా మంచి మార్కెటింగ్ మేనేజర్ కూడా. మహేష్ సినిమాలు అన్ని ఆమె మార్కెట్ చేస్తుంది. లేటెస్ట్ గా భరత్ అనే నేను సినిమాకు ఆమె దగ్గరుండి మార్కెట్ చేస్తుంది.

శ్రీమంతుడికి కూడా....

మహేష్ సినిమాలకు ఎలా ప్రమోట్ చేయాలి? ఎలా చేస్తే సినిమాకు హైప్ వస్తుందన్న విషయాలు ఆమె తన టీంకి చెబుతుంటుంది. శ్రీమంతుడు సినిమా అంత హిట్ అవ్వడానికి కారణం వెనక ఓ రహస్య మార్కెటింగ్ స్ట్రాటెజీనే ఉపయోగించింది నమ్రత. ఒక మార్కెటింగ్ టీంను తీసుకుని సోషల్ మీడియా ద్వారా శ్రీమంతుడు లోని సోషల్ పాయింట్ ను హైలెట్ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేయించింది.

వందల సంఖ్యలో హోర్డింగ్ లు....

సినిమా కలెక్షన్స్ కూడా అంతలా రావటానికి కారణం నమ్రత వ్యూహమేనంటారు. అయితే ఇప్పుడు భరత్ అనే నేను సినిమాని కూడా అదే రేంజ్ లో హిట్ చేయాలనీ మళ్లీ మార్కెటింగ్ పగ్గాలు చేపట్టింది నమ్రత. హైదరాబాద్ లో మహేష్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 200 హోర్డింగులను ఏర్పాటుచేయబోతోంది. రెండు స్టేట్స్ లో కలిపి మొత్తంగా 350 హోర్డింగులు పెట్టాలని ప్లాన్ చేస్తుందట. అటు ఈ సినిమా నిర్మాత దానయ్య కూడా ప్రొమోషన్స్ విషయంలో ఏమీ రాజీ పడటం లేదంట. నమ్రత చెప్పినట్టుగానే ఆ హోర్డింగులు ఏర్పాటు చేయటానికి రెడీ అయ్యాడు నిర్మాత.

Similar News