నాగ్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్!!

కరోనా పరిస్థితిలు ఎలా ఉన్నా సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్స్ చేసుకోవడానికి సమాయత్తమవుతోంది. సీనియర్, చిన్న, స్టార్ హీరోలంతా ఎప్పటిలాగే సెట్స్ మీదహడావిడిగా షూటింగ్ చేసుకుంటున్నారు. సీనియర్ [more]

Update: 2020-11-06 08:48 GMT

కరోనా పరిస్థితిలు ఎలా ఉన్నా సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్స్ చేసుకోవడానికి సమాయత్తమవుతోంది. సీనియర్, చిన్న, స్టార్ హీరోలంతా ఎప్పటిలాగే సెట్స్ మీదహడావిడిగా షూటింగ్ చేసుకుంటున్నారు. సీనియర్ హీరోలందరి కన్నా ముందే నాగార్జున బుల్లితెర షో బిగ్ బాస్ షూటింగ్ కి వచ్చేసాడు. బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్న నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులుమనాలీ వెళ్లడమే కాదు.. వారం వారం బిగ్ బాస్ కోసం మనాలి నుండి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్నాడు. మరి తాజాగా నాగార్జున మరో మల్టీస్టారర్ మూవీ షూటింగ్ షురూ అయ్యింది.

అది బాలీవుడ్ లో భారీ నటులు అంటే అమితాబచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్ లాంటి స్టార్స్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ కూడా మొదలు కావడంతో అందులో నటిస్తున్న నాగార్జున ఇప్పుడు ముంబై ఫ్లైట్ ఎక్కాడు. బ్రహ్మాస్త్ర లో ఆర్కియాలజిస్టుగా నాగార్జున కనిపించనున్నాడు. ఆ సినిమాలో నాగ్ కాంబో సీన్స్ షూట్ స్టార్ట్ కావడంతో నాగార్జున ఇప్పుడు ముంబై కి వెళ్లాల్సివచ్చింది. మరి వారం వారం బిగ్ బాస్ షో తో పాటుగా కులుమనాలి లో వైల్డ్ డాగ్ షూటింగ్, మధ్యలో బ్రహ్మాస్త్ర షూటింగ్.. మరి నాగ్ ఈ వయసులో ఆయన డెడికేషన్ కి మెచ్చుకోవలసిందే. ఒకేసారి మూడు రకాల షూటింగ్స్ తో నాగార్జున ఏ సీనియర్ హీరో చెయ్యని సాహసం చేస్తున్నాడు.

Tags:    

Similar News