’మ‌న్మ‌ధుడు 2` ఫ్యామిలీతో నాగార్జున‌

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. గ‌త వారం షూటింగ్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, [more]

Update: 2019-04-02 08:19 GMT

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. గ‌త వారం షూటింగ్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌లో చిత్ర యూనిట్ తో క‌లిసి నాగార్జున సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశారు. 'నేను నా మ‌న్మ‌థుడు 2 ఫ్యామిలీ! ల‌వింగ్ ఇట్‌' అనే మెసేజ్‌ను కూడా అందులో ఫోటోతో పాటు పోస్ట్ చేశారు నాగ్‌. ఈ సెల్ఫీలో నాగార్జున‌, ర‌కుల్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ త‌దిత‌రులున్నారు. ఫస్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఆర్ట్‌ డైరెక్ట‌ర్ రామ‌కృష్ణ అన్‌షపూర్ణ స్టూడియోలో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్‌లో ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

Tags:    

Similar News