కొడుకుల కంటే స్పీడ్ గా ఉన్నాడు

కింగ్ నాగార్జున దేవదాస్ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని జెట్ స్పీడ్ తో రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా కాలం నుండి [more]

Update: 2019-03-17 10:40 GMT

కింగ్ నాగార్జున దేవదాస్ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని జెట్ స్పీడ్ తో రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా కాలం నుండి సినిమాకు సంబంధించి పనులు జరుగుతున్న బంగార్రాజు తో పాటు మన్మధుడు-2 కూడా సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు.

కళ్యాణ్ కృష్ణ రీసెంట్ గా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో నాగ్ ని ఇంప్రెస్స్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జూన్ నుండి ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. ఇందులో ఓ విషయం ఏంటంటే ఈ సినిమాలో తాతగా నాగ్, మనవడిగా నాగచైతన్య నటించబోతున్నారు.

ఇక మన్మధుడు-2 సినిమా అంతకుముందే సెట్స్ పైకి రాబోతోంది. ఈసినిమా ఈనెల నుండి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే, బంగార్రాజు సినిమా మొదలవుతుంది. ఈ రెండు సినిమాలు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే రాబోతున్నాయి. కొడుకులు కంటే స్పీడ్ గా ఉన్నాడు నాగ్

Tags:    

Similar News