నాగ్ ఎందుకు శ్రీరామ్ ఆదిత్య ను తిట్టేవాడు?

Update: 2018-10-18 04:01 GMT

మ‌ల్టీస్టార‌ర్ చేస్తే బాగుంటదని..కలెక్షన్స్ బాగుంటాయి అని..హీరోలు మధ్య బాండింగ్ బాగుంటది చెబుతారు కానీ మ‌ల్టీస్టార‌ర్ తీయడం అంటే అదో త‌లనొప్పి వ్యవ‌హారం. ఇద్దరు హీరోల ఇగోల్ని సంతృప్తి ప‌ర‌చ‌డం చాలా క‌ష్టం. ఇక స్టార్ హీరోలని అయితే మరీ కష్టం. రీసెంట్ గా శ్రీరామ్ ఆదిత్య తన డైరెక్షన్ లో నాగార్జున - నాని ల పెట్టి 'దేవదాస్' సినిమా తీసాడు. ఈసినిమా విషయంలో శ్రీరామ్ తెగ ఇబ్బంది పడ్డాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

చాలా ఇబ్బంది పెట్టారు.......

నాగార్జున, నానిల ఇగోల్ని సంతృప్తి ప‌ర‌చ‌డానికి చాలా క‌ష్టప‌డ్డాడ‌ని..ఎడిటింగ్ రూమ్ లో శ్రీరామ్ పడిన బాధ అంత ఇంత కాదని సమాచారం. నాగ్ అండ్ నాని చాలాసార్లు శ్రీరామ్ పై కోపం ప్రద‌ర్శించేవారని..సీన్స్ విషయంలో శ్రీరామ్ ను బాగా ఇబ్బంది పెట్టారని టాక్. 'దేవదాస్' ప్రెస్ మీట్ లో నాగ్ శ్రీరామ్ ను 'బ‌ద్దక‌స్తుడు'అని పిలిచిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ విషయంలో నాగ్ శ్రీరామ్ ను తెగ తిట్టేవాడినని నిజాయ‌తీగా నిజం ఒప్పుకున్నాడు. తిట్టడమే కాకుండా భ‌విష్యత్తులో తాను అద్భుతాలు సృష్టిస్తాడ‌ని కితాబు ఇచ్చాడు నాగ్.

రూడ్ గా ఎందుకంటే...?

ఈ తిట్లు, పొగడ్తలు సినిమాల విషయంలో కామన్. అవన్నీ ఆ సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంటాయి అని కొంతమంది చెబుతున్న మాట. క‌థానాయ‌కుల‌కు ఇగోలు ఉంటాయ‌ని, అది త‌మ జన్మ హక్కని అనుకుంటామని..అందుకే కొన్ని సార్లు… రూడ్‌గా ప్రవ‌ర్తించాల్సివ‌స్తుంద‌ని నాగ్ చెప్పాడు. సో నాగ్ ఇలా ఓపెన్ అవ్వడంతో తేరా వెనుక ఏమి జరిగిందని అనేదానిపై క్లారిటీ వచ్చింది. సినిమాకు మంచి వసూల్ వస్తున్నాయి కాబట్టి సరిపోయింది లేకపోతే శ్రీరామ్ ప‌రిస్థితి ఏమైయేదో?

Similar News