దేవదాస్ కు షాకింగ్ బిసినెస్

Update: 2018-09-24 03:32 GMT

దేవా దాసులుగా ఈనెల 27న మన ముందుకు వస్తున్నా నాగార్జున - నానిల సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎన్నడూ లేని ఆసక్తి ఏర్పడింది. తొలిసారిగా వీరి కాంబినేషన్ లో సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకు అన్ని ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. నాని - నాగార్జున డిఫరెంట్ పాత్రల్లో కనిపించడంతో బిజినెస్ కూడా అదే విధంగా జరిగింది.

నాగార్జున - నాని చిత్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసినిమా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.37 కోట్లకు అమ్ముడైంది. నైజాం రూ.12 కోట్లు అమ్ముడుపోగా...సీడెడ్ రూ.5 కోట్లకు..ఆంధ్రలో అన్ని ఏరియాస్ కలిపి రూ.14 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.30 కోట్ల బిజినెస్ మార్కును అందుకుంది ఈసినిమా. సినిమా మీద క్రేజ్ తో ఓవర్సీస్ రూ.4.5 కోట్లకు అమ్ముడైంది. మిగిలిన ఏరియాస్ నుండి 3 కోట్లు వచ్చాయి. మొత్తంగా 37 కోట్లు బిసినెస్ చేసింది దేవదాస్.

ఇక హిందీ డబ్బింగ్..శాటిలైట్.. డిజిటల్ రైట్స్ కూడా ఉన్నాయ్. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అవి కూడా ఇట్టే అమ్ముడైపోతాయి. అవ్వని కలుపుకుని ఓ 13 కోట్లు దాకా వస్తే.. ఓవరాల్ గా ఈసినిమా రూ.50 కోట్ల మార్కు దాటే అవకాశం ఉంది. టాక్ బాగుంటే రికవరీ కూడా పెద్ద కష్టమేమీ కాదు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

Similar News