నాగార్జున కల తీరేలా లేదే

నాగార్జున కు మంచి హిట్ ఇచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలోని బంగార్రాజు పాత్ర పేరుతో నాగార్జున ఓ సినిమా తీయాలని అనుకున్నాడు. అనుకోవడమే కాదు అది తన [more]

Update: 2019-08-08 06:16 GMT

నాగార్జున కు మంచి హిట్ ఇచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలోని బంగార్రాజు పాత్ర పేరుతో నాగార్జున ఓ సినిమా తీయాలని అనుకున్నాడు. అనుకోవడమే కాదు అది తన కల అని కూడా చెప్పాడు. సోగ్గాడే సినిమాని డైరెక్ట్ చేసినకల్యాణ్ కృష్ణే బంగార్రాజు చిత్రానికి డైరెక్టర్ అని నాగార్జున ఫిక్స్ అయ్యాడు. కానీ కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు స్క్రిప్ట్ తో నాగ్ ని చాలా కాలం నుంచి ఇంప్రెస్స్ చేయలేకపోయాడు. ఎలాగో నాగార్జున చేత బంగార్రాజు స్క్రిప్ట్ ని ఓకె చేయించుకుని కళ్యాణ్ కృష్ణ త్వరలోనే ఆ సినిమాని మొదలెట్టాలనుకున్నాడు. మన్మధుడు 2 తర్వాత నాగార్జున, కళ్యాణ్ కృష్ణ తో బంగార్రాజు సినిమా సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు… నాగ చైతన్య తో కలిసి…. బంగార్రాజు స్క్రిప్ట్ ని కళ్యాణ్ కృష్ణ చిన్న సైజు మల్టీస్టారర్ గా రాసుకుని అందులోకి చైతు ని కూడా దించాడు.

మళ్లీ వాయిదా….

ఇక రేపో మాపో బంగార్రాజు పట్టాలెక్కబోతుంది అనుకున్న టైం లో ఆ సినిమా ముహూర్తం వాయిదా పడింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు హఠాన్మరణంతో కళ్యాణ్ కృష్ణ తన సొంతూరుకు వెళ్ళాడు. కొన్ని రోజులు ఆయన అక్కడే ఉంటారని సమాచారం. అయితే ఈ లోపు నాగార్జున కూడా బంగార్రాజు స్క్రిప్ట్ లో కాస్త మార్పులు చేర్పులు చేస్తే బావుంటుందని ఆలోచన చేస్తున్నట్లుగా టాక్. మొన్నటివరకు నాగ్ ని ఒప్పించడానికి నానాతంటాలు పడిన కళ్యాణ్ కృష్ణ ఎలాగో… నాగ్ చేత తన బంగార్రాజు కథకి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ కథలో మార్పులు చేర్పులు అంటే మళ్ళీ కళ్యాణ్ కృష్ణకి టెన్షన్స్ స్టార్ట్ అయినట్లే. మరి నిజంగా నాగార్జున బంగార్రాజు సినిమా కల తీరుతుందో లేదో అనేది ప్రస్తుతం అందరిముందున్న పెద్ద డౌట్.

Tags:    

Similar News