ఇప్పుడు జోక్యం లేదంటే.. అప్పుడు ఉన్నట్టేగా..!

నాగార్జున.. నాగ చైతన్య విషయంలో ఏమో కానీ.. అఖిల్ సినిమాల విషయంలో మితిమీరి జోక్యం చేసుకుంటాడంటారు. అఖిల్ నటించింది రెండు సినిమాలే. అందులో ఒక సినిమా నితిన్ [more]

Update: 2019-01-24 07:59 GMT

నాగార్జున.. నాగ చైతన్య విషయంలో ఏమో కానీ.. అఖిల్ సినిమాల విషయంలో మితిమీరి జోక్యం చేసుకుంటాడంటారు. అఖిల్ నటించింది రెండు సినిమాలే. అందులో ఒక సినిమా నితిన్ నిర్మాతగా చేస్తే… రెండో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే అంటే ఓన్ బ్యానేర్ లోనే చేసాడు. తాజాగా మూడో సినిమాని భోగవల్లి ప్రసాద్ కి చేసాడు. అయితే మొదటి రెండు సినిమాల విషయంలో నాగార్జున ఎడిటింగ్, షూటింగ్ విషయంలోనూ వెలు పెట్టాడని… కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు చాలా కష్టపడుతున్నాడని అన్నారు. ఇక నాగార్జున కూడా ఆ రెండు సినిమాల ఈవెంట్స్ లోనూ అఖిల్ స్టార్ హీరో అన్న రేంజ్లో మట్లాడాడు. కానీ మిస్టర్ మజ్ను విషయంలో నాగ జోక్యం పెద్దగా లేనట్లే కనబడుతుంది. ఎందుకంటే మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున అఖిల్ గురించి ఆచితూచి మాట్లాడడమే కాదు…. అందరి ముందు అఖిల్ ని.. తారక్ ని చూసి మాస్ నేర్చుకో అని చెప్పడం.. మిస్టర్ మజ్ను షూటింగ్ లో కూడా పెద్దగా ఇన్వాల్వ్ కాలేదంటున్నారు.

అచ్చొచ్చిన టైటిల్ తో…

మరి తాజాగా మిస్టర్ మజ్ను ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అఖిల్ కూడా మిస్టర్ మజ్ను సినిమా విషయంలో నాన్న జోక్యం లేదని చెబుతున్నాడు. దీనిని బట్టి చూస్తుంటే… ముందు సినిమాల్లో నాగార్జున జోక్యం కాస్త ఎక్కువగా ఉన్నదని ఒప్పుకున్నట్లేగా. ఇక అప్పుడప్పుడు సినిమా రష్ మాత్రం చూశారని… స్క్రిప్ట్ మాత్రం విన్నారని… కథ విషయంలో ఒక్క మార్పు కూడా చెప్పలేదంటున్నాడు అఖిల్. ఇక ఈ సినిమా విజయంపై అఖిల్ తో పాటుగా నాగ్ కూడా ధీమాతోనే ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీకి మజ్ను టైటిల్ అచ్చొచ్చింది. నాగేశ్వర రావు కి లైలా మజ్ను, నాగార్జునకి మజ్ను హిట్స్ ఇస్తే తాజాగా అఖిల్ మిస్టర్ మజ్ను ఫలితం కోసం వెయిట్ చేస్తున్నాడు.

Tags:    

Similar News