నాగ్ చేయడానికి సినిమాలే లేవంట

కింగ్ నాగార్జున నుండి మన్మథుడు-2 సినిమా వస్తుంది. మరో 24 గంటల్లో రిలీజ్ అవుతున్న ఈసినిమా పై అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా తరువాత మీరు ఏ [more]

Update: 2019-08-08 07:43 GMT

కింగ్ నాగార్జున నుండి మన్మథుడు-2 సినిమా వస్తుంది. మరో 24 గంటల్లో రిలీజ్ అవుతున్న ఈసినిమా పై అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా తరువాత మీరు ఏ సినిమా చేస్తున్నారు అన్న ప్రశ్నకు తను నెక్స్ట్ చేయడాని సినిమాలు ఏమి లేవు అని స్వయంగా నాగార్జుననే చెప్పాడు. బంగార్రాజు సినిమా ఇప్పుడు తన చేతుల్లో లేదంటున్నాడు నాగ్.

తొందరపెట్టడం ఇష్టంలేక…

బంగార్రాజు చిత్రం కోసం కళ్యాణ్ కృష్ణ ఎప్పటినుండో కథ పై కూర్చుకుని ప్రీ ప్రొడక్షన్ కి అంత ముగించుకుని సెట్స్ మీదకు తీసుకుని వెళదాం అనుకున్న టైములో కళ్యాణ్ కృష్ణ అన్నయ్య హఠాత్తుగా కన్నుమూశాడు. ఇక అప్పటినుండి నేను కళ్యాణ్ కృష్ణ తో టచ్ లో లేనని చెప్పాడు నాగార్జున. ఇటువంటి టైంలో నేను కళ్యాణ్ కృష్ణ ని తొందర పెట్టడం తనకు ఇష్టం లేదని అతను ఎప్పుడు వస్తే అప్పుడు చర్చిద్దాం అనుకుంటున్నా అని చెప్పారు.

కథలు కూడా లేవట….

బాలీవుడ్ లో నాగ్ బ్రహ్మాస్త్ర అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. అలానే తమిళంలో ధనుష్ డైరెక్షన్ లో నాగ్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది కూడా ఆగిపోయిందని నాగ్ చెప్పాడు. ప్రస్తుతం నాగ్ దగ్గర కథలు ఏమి లేవు. ఎలాగో నాగ్ కొత్తవారికి ఛాన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఎవరన్నా ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేసి నాగ్ కి స్టోరీ చెప్పేయొచ్చు.

Tags:    

Similar News