నాగ్ ఫ్యామిలీ మొత్తం అక్కడికేనా..?

Update: 2018-09-26 07:13 GMT

సినిమాలతో, వ్యాపారాల‌తో బిజీగా ఉంటూనే ఫ్యామిలీతో ఎలా గడపాలో, ఎలా ఎంజాయ్ చెయ్యాలో నాగార్జునకి బాగా తెలుసు. అందుకే తన సినిమా మొత్తం కంప్లీట్ అయ్యిపోగానే ఫామిలీతో హాలిడేకి వెళ్తుంటారు నాగ్. ఇలా నాగ్ కు ఎప్పటినుండో ఉన్న అలవాటే. ఈ నేపథ్యంలో నాగ్ తన ఫామిలీతో మరో ట్రిప్ కు వెళ్లనున్నారు. నాని - నాగ్ లు నటించిన 'దేవదాస్' సినిమా ఈనెల 27న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రొమోషన్స్ అన్నీ త్వరగా ఫినిష్ చేసుకుని ట్రిప్ కి వెళ్లనున్నాడు నాగ్. రీసెంట్ గా నాగ చైతన్య 'శైల‌జారెడ్డి అల్లుడు', స‌మంత సినిమా 'యూట‌ర్న్ విడుదలైన సంగతి తెలిసిందే. వీరు తమ సినిమాల ప్రమోషన్స్ అన్నీ ముగ్గించుకుని ఆల్రెడీ స్పెయిన్ వెళ్లారు. అక్కడ ఓ ఐలాండ్ లో కొన్ని రోజులు పాటు గడపనుంది ఈ జంట. వీరితో పాటు అఖిల్ కూడా వెళ్లినట్టు తెలుస్తుంది.

ఫ్యామిలీ అంతా అక్కడే...

అయితే ఇప్పుడు నాగ్ కూడా తన ఫామిలీతో అదే ఐలాండ్‌కి వెళ్ల‌బోతున్నారు. అంటే.. నాగ్ ఫ్యామిలీ మొత్తం ఆ ఐలాండ్ లోనే కొన్ని రోజులు ఉండ‌బోతున్నార‌న్న‌మాట‌. నాగ్ ఫామిలీ మొత్తం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే వాటికి కొంత‌కాలం బ్రేక్ ఇచ్చి.. ఇలా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశాడు నాగ్‌. అక్కడ కనీసం వారం రోజులు ఉండనున్నారని సమాచారం. ఆ ట్రిప్ అయ్యిపోయిన వెంటనే తిరిగి షూటింగ్స్ లో మళ్లీ బిజీ కానున్నారు.

Similar News