బంగార్రాజు హీరోయిన్ ఫిక్స్..!

నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా హిట్ అయ్యాక… ఆ సినిమాలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రతో నాగ్ సినిమా [more]

Update: 2019-04-05 09:08 GMT

నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా హిట్ అయ్యాక… ఆ సినిమాలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రతో నాగ్ సినిమా చెయ్యాలనుకున్నాడు. అంటే ఆ సినిమా సోగ్గాడే చిన్నినాయనకు సీక్వెల్ గా తెరకెక్కనుందని అన్నారు. కానీ మధ్యలో నాగార్జున బంగార్రాజు సినిమాని ఆపేసినట్లుగా వార్తలొచ్చాయి. కళ్యాణ్ కృష్ణ వర్క్ నచ్చక బంగార్రాజుని నాగ్ పట్టాలెక్కించేందుకు ధైర్యం చెయ్యడం లేదన్నారు. కానీ నాగ్ రీసెంట్ గా బంగార్రాజు సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని చెప్పాడో లేదో… అప్పుడే బంగార్రాజు సినిమాపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చేశాయి.

హీరోయిన్ గా నయనతార

కళ్యాణ్ కృష్ణ, నాగార్జున కోసం బంగార్రాజు స్క్రిప్ట్ మీద కూర్చున్నాడని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో మొదలయిందని.. అలాగే నాగ్ రాహుల్ డైరెక్షన్ లో చెయ్యబోయే మన్మధుడు 2తో పాటుగా బంగార్రాజు సినిమాని కూడా పట్టాలెక్కిస్తాడని అంటున్నారు. తాజాగా నాగార్జున కోసమే కళ్యాణ్ కృష్ణ హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలు పెట్టాడని.. అందుకోసం తమిళ లేడి సూపర్ స్టార్ నయనతారని కళ్యాణ్ కృష్ణ కలిసి బంగార్రాజు కథ చెప్పాడని.. నాగార్జున సినిమా చేయడానికి సుముఖంగా ఉందని ఫిలింనగర్ టాక్. మరి గతంలో నాగార్జునతో నయనతార బాస్ అనే యావరేజ్ సినిమాలో, గ్రీకువీరుడు అనే డిజాస్టర్ లో నటించింది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో చెయ్యనున్నాడు.

Tags:    

Similar News