ఎట్టకేలకు నాగ్ ఓకే చెప్పాడు..!

గతంలో నాగార్జున – రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో నాగార్జున ‘బంగార్రాజు’ [more]

Update: 2019-01-18 07:38 GMT

గతంలో నాగార్జున – రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో నాగార్జున ‘బంగార్రాజు’ అనే పాత్రలో అందరినీ బాగా ఎంటర్టైన్ చేసాడు. ఇప్పుడే అదే పేరుతో అంటే ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ తీయనున్నారు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. కథ గురించి ఎప్పుడో చెప్పి ఓకే చేయించుకున్న కళ్యాణ్ ఇంతవరకు దీన్ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లలేదు. కారణం కథలో మార్పులు .. చేర్పులు జరుగుతూ వస్తున్నాయట.

నాగచైతన్య కూడా…

అయితే తాజాగా నాగ్ కథ పట్ల సంతృప్తికరంగా ఉండడంతో సెట్స్ మీదకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు కళ్యాణ్. ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కించనున్నాడు నాగార్జున. ఇందులో నాగ్ తో పాటు నాగ చైతన్య కూడా ఓ మంచి పాత్ర చేస్తున్నాడు. తాత పాత్రలో నాగార్జున.. మనవడి పాత్రలో చైతూ కనిపించనున్నారని సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News