జనసేన తరుపు పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు నాగబాబు ఆన్సర్ ఇది

Update: 2018-05-01 16:37 GMT

తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై మెగా హీరోలు స్పందించటంలేదు అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. సమస్య తలెత్తినప్పుడు ఎలాగో "మా" స్పందించినప్పుడు మేము ఎందుకు అని ఆగుతాం అంతే. అంతేకాకుండా ఇటువంటి విషయాల్లో మేము తొందరపడి ఏం మాట్లాడిన ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదని అందుకే మేము ఏమి మాట్లాడిన ఆచి తూచి మాట్లాడతాం అని చెప్పారు నాగబాబు.

తమ పరిధిలో ఉన్నవారిని నియంత్రించగలమని, లక్షలాది మంది అభిమానుల్లో ఎవరో ఒకరు తప్పు చేస్తే, దానికి తమను బాధ్యులను చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు అందరిలో చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఎవరు ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారో తమకి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.

మీరు వచ్చే ఎలక్షన్స్ లో జనసేన తరుపున పోటీ చేస్తారా అని అడిగితే.. దానిపై ఇంకా క్లారిటీ లేదని చెప్పాడు. అలానే పార్టీ తరుపున ప్రచారం నిర్వహిస్తానా? లేదా? అనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. దీని గురించి ఇప్పుడు ఏం మాట్లాడిన అది తొందరపాటు అవుతుందని అయన అన్నారు.

Similar News